అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు 533 బ్యాంకుల్లో రిజిస్ట్రేష‌న్లు!

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు 533 బ్యాంకుల్లో రిజిస్ట్రేష‌న్లు!
అమ‌ర్‌నాథ్ యాత్రలో పాల్గొనేందుకు భ‌క్తులు ఆస‌క్తి ఏడాదికేడాది పెరుగుతుంది. ఈ క్ర‌మంలో ఐదురోజుల్లోనే యాత్ర కోసం సుమారు రెండు ల‌క్ష‌ల మంది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. జులై 3 నుంచి మొద‌ల‌య్యే యాత్ర‌లో.. అమ‌ర్‌నాథ్ గుహ‌లో కొలువైన మంచు లింగాన్ని ద‌ర్శించుకునేందుకు శివ‌భ‌క్తులు ఆస‌క్తి చూపిస్తున్నారు. గ‌తంలో 15 నుంచి 20 రోజుల్లో మంచు అదృష్య‌మైంది. స‌మీపంలోని కొండ ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం భారీగా మారిపోయింది.
ఇదిలా ఉండ‌గా, దేశ‌వ్యాప్తంగా 533 బ్యాంకు శాఖ‌ల‌లో యాత్రికుల న‌మోదు ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఏప్రిల్ 16న పంజాబ్ నేష‌నల్ బ్యాంకు శాఖ‌లో ప్రారంభ‌మైన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టికీ కొన‌సాగు మూడు రోజుల్లో 233 మంది భ‌క్తులు పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. శ‌నివారం రోజున భ‌క్తుల నుంచి స్పంద‌న క‌నిపించింది. ఒకే రోజు బ్యాంకులో 43 మంది పేర్లు న‌మోదు చేసుకున్నారు. బ‌ల్తాల్ మార్గంలో 20 మంది, ప‌హ‌ల్గామ్ మార్గంలో వెళ్లేందుకు 23 మంది పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు.
గత సంవత్సరం మొత్తం యాత్ర సీజన్‌లో కథువా జిల్లా నుంచి దాదాపు 400 మంది భక్తులు యాత్ర కోసం పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు.  అయితే, ఈసారి రిజిస్ట్రేషన్ సంఖ్య కేవలం మూడు రోజుల్లోనే 233 కి చేరుకుంది. ఇందులో 93 మంది భక్తులు బాల్తాల్ ద్వారా, పహల్గామ్ ద్వారా 140 మంది భక్తులు వెళ్ల‌నున్నారు. ఇందులో అత్యంత ప్రత్యేక అంశం ఏమిటంటే 75 మంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. ప్రజల ఉత్సాహాన్ని చూసి, బ్యాంకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.