హైదరాబాద్‌లో సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజులపాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. డైమండ్ పాయింట్లోని అరిహంత్ ఎంక్లేవ్లోని ఆయన నివాసం వద్ద ఈడీ అధికారులు బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి నరేంద్ర సురాణా ఇంట్లో సోదాలు
ప్రారంభించి గురువారం ముగించారు.
సురానా ఇంట్లో భారీగా నగదు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షేల్ కంపెనీలకు నిధుల బదలాయింపు చేశారని, పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతున్నది.
సాయి సూర్య సురానా కార్యాలయాల్లో కోట్లలో నగదుతో పాటు పలు డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు. సోలార్ వ్యాపారంలో ఉన్న సూరనా గ్రూప్స్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్‌ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
ఈ మోసాలపై ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో 2019లోనే బెంగళూరు విభాగం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. సురానా గ్రూప్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్నా, వారికి హైదరాబాద్‌లో వ్యాపారాలున్నాయి. 2021 ఫిబ్రవరిలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో రూ.11.62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.
గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్‌తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లలో డమ్మీ డైరెక్టర్లను నియామకం చేసి ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు.
సింగపూర్‌లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ, కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు నిర్ధారించారు. కాగా, సాయిసూర్య డెవలపర్స్ ఎండీ సతీశ్‌చంద్ర గుప్తాపై ఇటీవలే పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టిస్తామంటూ ప్రీలాంచ్‌పేరిట కోట్లను వసూలు చేసి, మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వట్టి నాగులపల్లిలో సతీష్ వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్‌పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం