
హైదరాబాద్‌కు చెందిన ఈ టీనేజర్ చిన్న వయసులోనే అమెరికా వలస వెళ్లాడు. 2023వ సంవత్సరానికిగాను సిద్ధార్థ్‌ను ఇన్నోవేటర్ ఆఫ్‌ది ఇయర్‌గా ఫ్రిస్కో చాంబర్ ఆఫ్ కామర్స్ ఎంపిక చేసింది. అదే ఏడాది అమెరికా ప్రజాప్రతినిధుల సభ అతడికి గుర్తింపు సర్టిఫికెట్‌ను జారీచేసింది. తన పరికరం పని విధానాన్ని సిద్ధార్థ్ వివరిస్తూ ‘సర్కేడియన్ ఏఐ అనేది ఒక ఆటోమేటెడ్ పరికరం. ఇది ఏడు క్షణాలపాటు గుండె చప్పుడు విని సమగ్ర నివేదికను అందిస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉన్నదా లేక ఏమైనా సమస్యలున్నాయా అన్నది వెల్లడిస్తుంది’ అని చెప్పాడు.
‘మీ గుండె మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఏఐ సహకారంతో పనిచేసే ఈ పరికరం మీ గుండె అంతర్దృష్టిని అందిస్తుంది’ అని తెలిపాడు. ఈ యాప్‌ను గుండె వద్ద ఏడు క్షణాల పాటు ఉంచితే అది 40 రకాల గుండె సంబంధిత వ్యాధులను పసిగడుతుంది అని తెలిపాడు.
అమెరికాలో 15 వేల మందిని భారత్‌లో 700 మందినిని, గుంటూరు,విజయవాడ ప్రభుత్వ దవాఖానల్లో 992 మందిని పరీక్షించగా 19 మంది హృద్రోగులు ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత వీరికి టూ(2)డీ ఈకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించగా సర్కేడియన్ పరికరం తేల్చింది నూటికి నూరు శాతం కరెక్ట్ అని తేలింది. వైద్యరంగానికి సహాయకరంగా ఉండేందుకే దీనిని అభివృద్ధి చేశానని, సొంతానికి కాదని స్పష్టం చేశాడు.
More Stories
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్