దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరంలో పది శాతం పైగా పెరిగి లక్ష కోట్ల రూపాయలకు చేరుకోవచ్చు. అమూల్ పాలు, అనుబంధ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణం. గుజరాత్ సహకారర పాల మార్కెటింగ్ సమాఖ్య (జిసి ఎంఎంఎఫ్) తన డెయిరీ ఉత్పత్తులను ‘అమూల్’ బ్రాండ్ కింద విక్రయిస్తుంటుంది.
ఇంకా సంస్థ 16 జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలు సొంతంగా స్థానిక జిల్లా మార్కెట్లలో విక్రయిస్తుంటాయి. అమూల్ బ్రాండ్ మొత్తం రెవెన్యూ 202526లో లక్ష కోట్ల రూపాయలకు చేరుకోవచ్చునని, ఇంతకు ముందు సంవత్సరంలో అది సుమారు రూ. 90 వేల కోట్లుగా ఉందని జిసిఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
‘జిసిఎంఎంఎఫ్‌లో మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధితో రూ. 75 వేల కోట్లకు చేరుకోవాలని లక్షంగా పెట్టుకున్నాం’ అని మెహతా డిమాంద్ వృద్ధిని ఊహిస్తూ చెప్పారు. 18 సభ్య సంఘాల ద్వారా అమూల్ ఉత్పత్తుల సరాసరి మార్కెటింగ్ నుంచి టర్నోవర్ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 25 వేల కోట్లుగా ఉంటుంది. దీనితో మొత్తం రెవెన్యూ లక్ష కోట్ల రూపాయలకు చేరుతుంది.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం