
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఆరోపించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎంకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం అభ్యర్ధులనే పోటీలో పెట్టలేదని గుర్తు చేశారు. మూడు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని 77,538 ఎకరాల వక్ఫ్ భూముల్లో 75 శాతం ఆక్రమణకు గురవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఏఐఎంఐఎం అగ్రనాయకుల పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏఐఎంఐఎంకు మద్దతుగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని నిలబెట్టకుండా ఏఐఎంఐఎంను గెలిపించేందుకు కుమ్మక్కయ్యాయని లక్ష్మణ్ మండిపడ్డారు.
వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతోపాటు వక్ఫ్‌బోర్డులో పారదర్శకత కోసమే కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
బిజెపి ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బయట బహిరంగంగా ఒకరిపై విమర్శలు చేసినా, పార్లమెంట, అసెంబ్లీ వేదికల్లో కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
బిజెపి ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బయట బహిరంగంగా ఒకరిపై విమర్శలు చేసినా, పార్లమెంట, అసెంబ్లీ వేదికల్లో కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న రహస్య ఒడంబడికలు మరోసారి బయటపడ్డాయని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతూ, బిజెపిని ఓడించేందుకు పరస్పర పొత్తులతో దోబూచులాడాయని తెలిపారు. అయినా, తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా విద్యావంతులు, మేధావులు బిజెపికి బాసటగా నిలిచారని పేర్కొంటూ ఇది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే నిర్ణయంగా మారిందని చెప్పారు.
కుల, మత, ప్రాంత పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని, అందులో కుట్రదారులుగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి పనిచేస్తున్నారని డా. లక్ష్మణ్ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం స్కాం-లక్షకోట్ల అవినీతి, ధరణి స్కాం, ఫోన్ ట్యాపింగ్, అక్రమ విద్యుత్ ఒప్పందాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినా, అధికారంలోకి వచ్చాక విచారణ మాత్రం చేయలేదని గుర్తు చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి