
* ఆయుధాలు అడ్డం పెట్టుకొని గిరిజనుల అభివృద్ధిని ఆపలేరు
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని మావోయిస్టు `సోదరులకు’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేస్తున్నా కాల్పులలో ఏ మావోయిస్టు చనిపోయినా సంతోషింపలేమని, వారు కూడా తమలో భాగమే అని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో దంతేవాడలో పర్యటిస్తున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పణ్‌డూమ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరని తేల్చి చెప్పారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని అమిత్‌షా ఉద్ఘాటించారు. “బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి” అని ప్రకటించారు.
లొంగిపోయి అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొంటూ గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 521 మంది లొంగిపోయినట్టు చెప్పారు. మావోయిస్టుల నుండి పూర్తిగా విముక్తి అయిన గ్రామానికి రూ 1 కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేస్తామని పేర్కొంటూ మావోయిస్టులకు ఈ విషయం చెప్పి, వారందరిని లొంగిపొమ్మనమని కోరాలని సూచించారు.
“మీ యువకులను ప్రభుత్వం చంపుతుందని నక్సల్స్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకండి. సోదర, సోదరీమణులారా ఎవ్వరినీ చంపాలని అనుకోవడం లేదు” అని హోంమంత్రి చెప్పారు. “నేడు, లొంగిపోయిన నక్సల్స్ అభివృద్ధి కోసం మాకు కంప్యూటర్లు కావాలి, తుపాకులు కాదు, పెన్నులు కావాలి, ఐఈడిలు లేదా బాంబులు కాదు అని అర్థం చేసుకున్నారు. 2025లో, మూడు నెలల్లో, 521 మంది నక్సల్స్ లొంగిపోయారు. గత సంవత్సరం 881 మంది లొంగిపోయారు,” అని ఆయన పేర్కొన్నారు.
50 ఏళ్లుగా బస్తర్ అభివృద్ధికి దూరమైందన్న అమిత్‌షా వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న నిశ్చయంతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు. అయితే స్థానికులు వైద్య, విద్య సదుపాయాలతోపాటు ఆధార్, రేషన్ కార్డులు , ఆరోగ్యబీమా పొందినప్పుడే ఇది సాధ్యమవుతుందన్న ఆయన నక్సల్స్ సమస్య తొలగిపోతేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
“మీరు ఏ పని (హింస) చేసినా… మీ ఆయుధాలను వదిలివేసి ప్రధాన స్రవంతిలోకి రండి, మేము మీ భద్రతకు హామీ ఇస్స్తాము. కానీ తుపాకులను ఉపయోగించడం ద్వారా మీరు బస్తర్ అభివృద్ధిని ఆపలేరు. ఇంకా ఆయుధాలు ఉంచుకోవాలనుకునే వారిని దళాలు ఎదుర్కొంటాయి. ఏమి జరిగినా, వచ్చే మార్చి నాటికి దేశం మొత్తం నక్సలైట్ల నుండి విముక్తి పొందుతుంది” అని అమిత్ షా ప్రకటించారు.
More Stories
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం