
శనివారం రాత్రి 9 గంటల సమయంలో గదిలోకి వెళ్లిన అఖిల్ గుండెపోటుతో మృతి చెందాడు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు రాజు నాయక్, దేవి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు.
కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ, స్వర్ణలత దంపతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు మాదాల రాహుల్ చైతన్య (21) జేఈఈలో జాతీయ స్థాయిలో 52వ ర్యాంకు సాధించి అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో గతేడాది ఆగస్టులో చేరాడు.
దివ్యాంగుడైన చైతన్య శనివారం రాత్రి గదిలోకి వెళ్లి నిద్రించాడు. అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి అనంతరం వసతి గృహం ఐదో అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో చైతన్య అక్కడికక్కడే మరణించాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన రాహుల్ చైతన్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా అఖిల్, రాహుల్ చైతన్యలు ఇద్దరు ప్రాంగణంలో చేరినప్పటి నుంచి మంచి స్నేహితులు అని, అఖిల్ మరణాన్ని తట్టుకోలేకనే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. చెవుడు, మూగతో బాధపడుతున్న రాహుల్‌కు అఖిల్ అండదండగా ఉండేవాడని స్నేహితులు వివరించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు మరణించారంటూ మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు.
ఇద్దరు విద్యార్థుల మృతిపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటుచేశామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఆత్మహత్యకు పాల్పడిన రాహుల్ పుట్టిన రోజు ఆదివారం జరగాల్సి ఉండగా అదే రోజు అతను ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబాన్ని విషాదంలో నింపింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు