
ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువవుతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారని గుర్తు చేశారు. కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని, బీజేపీ చేసిన పోరాటాలవల్ల పింక్ వైరస్ పీడ విరిగిందని చెప్పారు. కాంగ్రెస్ బారినుండి బీజేపీ ప్రజలను కాపాడుకుంటామని చెబుతూ పోరాటాలనే వ్యాక్సిన్ గా కాంగ్రెస్ అవినీతిపై యుద్దం చేయబోతున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందని, ఒక్కో కిలోకు 40 రూపాయలు మోదీ సర్కారే చెల్లిస్తోందని ఆయన చెప్పారు. సన్న బియ్యంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం కేవలం 10 రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరు కారుస్తున్నారని సంజయ్ ఆరోపించారు. శ్రవణ్ రావుతో సహా అందరికీ బెయిల్ వచ్చేలా చేసి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడుతోందని, అందుకే ఏడాదిన్నరైనా అరెస్ట్ కాదు కదా కనీసం నోటీసులిచ్చి విచారణ కూడా చేయండం లేదని విమర్శించారు.
ప్రజలను దారి మళ్లించడానికి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటూ మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్ధమైనాయని సంజయ్ ఆరోపించారు. మరి కొద్ది రోజుల్లో ఆ 3 పార్టీల అసలు రంగు బయటపడబోతోందని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ కు అత్యధిక మంది కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. మజ్లిస్ ను గెలిపించేందకు కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోందని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత