ఇజ్రాయిల్ ఆహారం, పంపిణీని అడ్డుకోవడంతో గాజాలో బేకరీలు వారంలోపు మూతపడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఆదివారం పేర్కొంది. బేకరీల్లో పిండి మంగళవారం వరకు రోజుకు 8,00,000 మందికి బ్రెడ్ ఉత్పత్తి చేయడానికి సరిపోతుందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) హెచ్చరించింది.
మొత్తంగా ఆహార సరఫరా గరిష్టంగా రెండు వారాల వరకు ఉంటుందని తెలిపింది. చివరి ప్రయత్నంగా 4,15,000 మందికి బలవర్థకమైన పోషక బిస్కెట్లు అత్యవసర నిల్వలను కలిగి ఉందని తెలిపింది. గాజాలో ఆహార పంపిణీని సంస్థలు సగానికి తగ్గించాయని, మార్కెట్లలో చాలా కూరగాయలు ఖాళీ అయ్యాయని తెలిపింది. ఇజ్రాయిల్ బాంబు దాడులతో సహాయసిబ్బంది వీధుల్లోకి వెళ్లలేకపోతున్నారని వెల్లడించింది.
గత నాలుగు వారాలుగా, ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌ఓని రెండు మిలియన్లకుపైగా పాలస్తీనియన్లకు ఆహారం, ఇంధనం, మందులు ఇతర సామగ్రిని నిలిపివేసింది. హమాస్‌కు వ్యతిరేకంగా 17 నెలలుగా చేస్తున్న దాడిలో ఇది అతిపెద్ద దిగ్భందం, ముగిసే సూచనలు లేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తీవ్రమైన ఆకలి, పోషకారలోపం పెరిగే అవకాశం ఉందని సహాయ సిబ్బంది హెచ్చరించింది.
సహాయ చర్యలను పునరుద్ధరించబడకపోతే ఆహారం అయిపోతుందని పేర్కొంది. ఇజ్రాయిల్ గాజాలో స్థానిక ఆహార ఉత్పత్తిని నాశనం చేసిందని తెలిపింది.
తాము పూర్తిగా సాయంపైనే ఆధారపడి ఉన్నామని ముగ్గురు పిల్లల తల్లి షోరూఖ్ షమ్లఖ్ పేర్కొన్నారు. ఉత్తర గాజాలోని జబాలియాలోని యుఎన్ పంపిణీ కేంద్రం నుండి తన కుటుంబానికి నెలవారీ సాయం సేకరిస్తామని అన్నారు. ఇవి మూసివేస్తే తమకు ఆహారం ఎవరు అందిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’