
ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్లుటీవోకు నిధులను నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి 2019 లోనే ట్రంప్ డబ్లుటీవోను బలహీనపర్చారు. నాడు ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు.
దీంతో ఆ సంస్థ వివాద పరిష్కార వేదిక విభాగం బలహీనపడిపోయింది. ఇది తరచూ తన పరిధిని దాటి మరీ తీర్పులు ఇస్తోందని ఎప్పటినుంచో వాషింగ్టన్ ఆరోపిస్తోంది. 2024లో డబ్లుటివో నిర్వహణకు 232 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతిదేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు.
ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11 శాతం అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఈ వారమే అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాను డబ్లుటీవో నుంచి పక్కకు తెస్తారనే ప్రచారం జోరందుకొంది. అక్టోబర్ 2 నుంచి ట్రంప్ లిబరేషన్ డే అని అభివర్ణిస్తున్నారు.
కొత్త పన్నుల నుంచి అమెరికా ప్రభుత్వానికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం రానుందని శ్వేతసౌధం వర్గాలు అంచనా వేశాయి. కాకపోతే ఈ నిర్ణయాలు ప్రపంచ పంపిణీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా నిర్ణయాలను డబ్లుటీవోలో సవాలు చేస్తామని చైనా వెల్లడించింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం