దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి. శుక్రవారంఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ను దోషిగా తేల్చింది. కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. బాజిందర్ సింగ్కు ఏప్రిల్ 1న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.

More Stories
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం
డిసెంబర్ 6న భారీ ఉగ్రదాడికి ఉమర్ కుట్ర
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు