ప్రతి సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో చేరేందుకు కొత్తగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని చెబుతూ వెబ్సైట్ (www.rss.org) ద్వారా 2012 నుండి 12,72,453 మందికి పైగా ఆర్ఎస్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపారని సంఘ్ సహ సర్ కార్యవాహ్ ముకుంద సి ఆర్ తెలిపారు.
బెంగుళూరులో మూడు రోజులపాటు జరిగే అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారిలో 46,000 మందికి పైగా మహిళలు ఉన్నారని చెప్పారు. ప్రతినిధి సభ సమావేశాలను సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే భారత మాత చిత్రానికి పుష్పాలు సమ్పార్పిస్తూ ప్రారంభించారు. దేశం మొత్తం నుండి 1482 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
వేలాది మంది మహిళా కార్యకర్తలు వివిధ రంగాలలో సంఘ్ కు సంబంధించిన వివిధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు. వెబ్సైట్ ద్వారా ఆర్ఎస్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపిన చాలామంది అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, బహ్రత్ వెలుపల నుండి కూడా ఉన్నారని చెప్పారు. కాగా, 51,570 ప్రదేశాలలో ప్రతిరోజూ మొత్తం 83,129 శాఖలు జరుగుతున్నాయని, ఇవి గత సంవత్సరపు 73,646 శాఖల కంటే 10,000 ఎక్కువ పెరుగుదల అని ఆయన వివరించారు.
గత సంవత్సరం కంటే వారపు మిలన్లు 4,430 పెరిగాయని వీటితో కలుపుకొని మొత్తం శాఖల సంఖ్య 1,15,276 అని చెప్పారు. ప్రతి వారం జరిగే మిలన్లు 32,147, నెలవారీ జరిగే మండలి 12,091 అని పేర్కొంటూ ఇవన్నీ కలిపి 1,27,367 అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది సంవత్సరంలో తన పనిని విస్తరించే దిశగా కృషి చేస్తుండగా, గ్రామీణ మండలాలపై ఎక్కువ దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ పరిపాలనా అవగాహన ప్రకారం, దేశం 58,981 గ్రామీణ మండలాలుగా విభజించగా, వీటిలో 30,717 మండలాల్లో రోజువారీ 9,200 మండలాల్లో వారపు మిలన్లు, అంటే మొత్తం 39,917 మండలాలలో శాఖలు జరుగుతున్నాయని, గత సంవత్సరంతో పోలిస్తే 67 శాతం – 3,050 పెరుగుదల అని చెప్పారు.
గత సంవత్సరం, సర్ సంఘచాలక్ సంఘ్ పని విస్తరణ, ఏకీకరణ కోసం 2 సంవత్సరాలు కేటాయించగల కార్యకర్తలను ఆహ్వానించారని ఆయన తెలియజేశారు. ఆయన పిలుపును గౌరవిస్తూ, శతాబ్ది విస్తారకులు అని పిలువబడే 2,453 మంది స్వయంసేవకులు తమ ఇళ్లను విడిచిపెట్టి సంఘ్ పని విస్తరణ, ఏకీకరణకు ముందుకు వచ్చారని చెప్పారు.
సంఘ్ పనిలో చేరే యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని చెబుతూ ప్రతి సంవత్సరం, లక్షలాది మంది యువత, ముఖ్యంగా 14-25 సంవత్సరాల వయస్సు గల వారు, స్వయంసేవకులుగా ఆర్ఎస్ఎస్లో చేరుతున్నారని ముకుంద వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,415 ప్రారంభ శిబిరాలు జరిగాయి. ఈ వర్గలకు 2,22,962 మంది హాజరయ్యారు. వారిలో 1,63,000 మంది 14-25 సంవత్సరాల వయస్సు గలవారు. వీరిలో 20,000 మందికి పైగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు.
నేడు దేశంలో 1 కోటి మందికి పైగా స్వయంసేవకులు ఉన్నారని ఆయన తెలిపారు. స్వయంసేవకులు సామాజిక సేవ, కార్మిక సంఘాలు, రైతులు మొదలైన సమాజంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ లో చేరే వారిలో ఎక్కువ మంది 12-14, 20-15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 40 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది సంఘ్ చేరినప్పటికీ, చాలా మంది బాలలుగా చేరుతారు. సంస్థలో చేరే కొత్త స్వయంసేవకుల సంఖ్య పెరిగింది.
“తమిళనాడులో, కొరత ఉన్న చోట, మేము కొత్త కార్యకర్తలను తీసుకుంటున్నాము. శాఖల సంఖ్య 4000 దాటింది. గతంలో మా ఉనికి పరిమితంగా ఉన్న బీహార్, ఒడిశాలలో కూడా, కొత్త స్వయంసేవకుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఆర్ఎస్ఎస్ విస్తరణ పనులకు వ్యతిరేకత లేదు. కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అది మతపరమైన కారణాల వల్ల కాదు, రాజకీయ కారణాల వల్ల అని గమనించాలి. కానీ దీనిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించవచ్చని మేము నమ్ముతున్నాం” అని ముకుంద వివరించారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ