బంగ్లాదేశ్ లో హింస, వందేళ్ల ప్రయాణంపై ఆర్ఎస్ఎస్ దృష్టి

బంగ్లాదేశ్ లో హింస, వందేళ్ల ప్రయాణంపై ఆర్ఎస్ఎస్ దృష్టి
 
* 21 నుండి బెంగుళూరులో జరిగే ప్రతినిధి సమావేశాల అజెండా
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలను (ఎబిపిఎస్) మార్చి 21, 22, 23 తేదీలలో బెంగళూరులోని జనసేవ విద్యా కేంద్ర ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల ప్రారంభంలో  సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే సంఘ్ పని స్థితిపై వార్షిక నివేదికను సమర్పిస్తారని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల కార్యకర్తలు తమ తమ ప్రాంతాలలో జరుగుతున్న కార్యకలాపాలు, కార్యక్రమాల నివేదికలను అందిస్తారని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
 
అఖిల భారతీయ ప్రతినిధి సభలను మార్చి 21 ఉదయం 9 గంటలకు చన్నెనహళ్లిలోని జనసేవ విద్యా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్  కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే సంయుక్తంగా ప్రారంభిస్తారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున, ఈ  సందర్భంగా సంఘ్ పని విస్తరణపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు.
 
2025 విజయదశమి నుండి 2026 విజయదశమి వరకు శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయి. విస్తృతమైన ప్రచారం ప్రణాళిక చేయబడుతుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పంచ పరివర్తన్ (సామాజిక సామరస్యం, కుటుంబ్ ప్రబోధన్, పర్యావరణ అవగాహన, ‘స్వ’ (స్వయం) పై పట్టుదల,  పౌరుల విధులు) గురించి కూడా చర్చిస్తారు. శతాబ్ది సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలను పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. 
 
మూడు రోజుల సమావేశాల సందర్భంగా ఎబిపిఎస్ రెండు తీర్మానాలను ఆమోదిస్తుందని సునీల్ అంబేకర్ తెలిపారు. మొదటి తీర్మానం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దారుణాలు, ముందుకు సాగే మార్గంపై ఉంటుంది. రెండవ తీర్మానం గత 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ప్రయాణం, శతాబ్ది సంవత్సరంలో కార్యకలాపాలు, ముందుకు సాగే మార్గంపై ఉంటుంది.
 
1525లో జన్మించిన  కర్ణాటకకు చెందిన సహసవంతురాలైన యోధురాలు రాణి రాణి అబ్బక్క 500 సంవత్సరాల జ్ఞాపకార్థం ఎబిపిఎస్ ఒక ప్రత్యేక ప్రకటనను కూడా విడుదల చేస్తుంది. ఈ ప్రకటన రాణి అబ్బక్క చేసిన అసమానమైన కృషిని గుర్తిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా కార్యక్రమాలు (ప్రశిక్షణ్ వర్గ్) గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఆర్‌ఎస్‌ఎస్ 95 వర్గ్ లను నిర్వహిస్తుందని, వాటిలో సంఘ శిక్షా వర్గ్ (ఎస్‌ఎస్‌వి), కార్యకర్త వికాస్ వర్గ్ (కెవివి) 1, కెవివి 2 ఉన్నాయని అంబేకర్ వివరించారు. 
 
40 ఏళ్లలోపు వారికి 72 అటువంటి వర్గాలను నిర్వహిస్తామని, 40 ఏళ్లు,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 23 వర్గాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పూజనీయ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దేశవ్యాప్తంగా జరిగే పర్యటనల కోసం ప్రణాళికలను కూడా ఎబిపిఎస్ ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు. 
 
నాలుగు సంవత్సరాల విరామం తర్వాత బెంగళూరులో ఎబిపిఎస్ నిర్వహిస్తున్నట్లు సునీల్ అంబేకర్ పేర్కొంటూ 32 సంఘ ప్రేరేపిత సంస్థలు, సమూహాల సంఘటన కార్యదర్శులు)లేదా సహ సంఘటన కార్యదర్శులు మూడు రోజుల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.  భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షురాలు, రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ్ సంచాలికా శాంతక్క జీ, బిజెపికి చెందిన ఎస్ జెపి నడ్డా, ఎబివిపికి చెందిన రాజ్ శరణ్, విహెచ్‌పి అధ్యక్షుడు అలోక్ కుమార్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమానికి చెందిన సత్యేంద్ర సింగ్, విద్యా భారతి, అనేక ఇతర సంస్థలు ఎబిపిఎస్‌లో పాల్గొంటారు. 
 
మార్చి 23 ఆదివారం ఉదయం 11.30 గంటలకు, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ కార్యకలాపాలపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, దేశవ్యాప్తంగా పనిని వ్యాప్తి చేయడంలో సంఘ్ కార్యకర్తలు జాతి నిర్మాణ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారని సునీల్ అంబేకర్ తెలిపారు. లక్షలాది మంది యువకులు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని కార్యకలాపాలలో చేరడానికి ముందుకు వస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
 
వేదికపై దక్షిణ మధ్య క్షేత్ర (కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ) క్షేత్ర కార్యవాహ ఎన్. తిప్పేస్వామి, అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్‌లు నరేంద్ర కుమార్, ప్రదీప్ జోషి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.