అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. నారీ శక్తికి వందనం తెలుపుతూ ఇవాళ మోదీ తన అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత సాధిస్తున్నామని పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలు పోస్టులు చేయనున్నట్లు తెలిపారు. వుమెన్ అచీవర్స్ ఆ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, సైంటిస్టులు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు ప్రధాని మోదీ అకౌంట్ నుంచి ట్వీట్స్ చేశారు.
ప్రధాని ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడం థ్రిల్‌గా ఉందని ఆ వుమెన్ అచీవర్స్ పేర్కొన్నారు. “వనక్కం.. నేను వైశాలి.. ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు” చెస్ క్రీడాకారిణి తెలిపారు. దేశం తరపున ఎన్నో టోర్నీలు ఆడానని, దాని పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆరేళ్ల ప్రాయం నుంచి చెస్ ఆడుతున్నట్లు చెప్పింది. లెర్నింగ్, థ్రిల్లింగ్, రివార్డింగ్ జర్నీలా ఉందని పేర్కొన్నది. యువ అమ్మాయిలకు ఆమె సందేశం ఇచ్చారు. ఎన్ని అవరోధాలు వచ్చినా.. కలలను వీడవద్దు సూచించారు.
పేదరికం, ప్రతికూలతల అడ్డంకులను అధిగమించి ‘బిహార్ పుట్టగొడుగుల మహిళ’గా అనితా దేవి ప్రసిద్ధి చెందారు. 2016లో మాధోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని స్థాపించారు. దీని ద్వారా తాను స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా వందల మంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించారు. వారికి ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్థిక సాధికారిత లభించేలా చేశారు.
“నేను అనితా దేవి. నలంద జిల్లాలోని అనంతపురం మా గ్రామం. నా జీవితంలో చాలా కష్టాలు చూశాను. నేను ఎప్పుడూ ఏదైనా సొంతంగా చేయాలని ఆలోచించేదాన్ని. అందుకే 2016లో మాధోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించాను. ఆ సమయంలో స్టార్టప్‌లకు మంచి క్రేజ్ కూడా ఉండేది. పుట్టగొడుగుల ఉత్పత్తి ద్వారా నేను నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను” అని అనితాదేవి ట్వీట్ చేశారు.
“అంతేకాదు వందలాది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, స్వావలంబన పొందేలా చేశాను. ఇప్పుడు మా కంపెనీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను చాలా చౌక ధరలకే రైతులకు అందిస్తోంది. నేను మా కంపెనీలో పనిచేసే మహిళలు జీవనోపాధితోపాటు, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు” అని వివరించారు.
ఎలినా మిశ్రా, శిల్పి సోని- వీరిద్దరూ ఆధునిక పరిశోధన, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళల ప్రగతికి ఉదాహరణలుగా నిలిస్తున్నారు. ఎలినా మిశ్రా ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ)లో అణు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. శిల్పిసోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో స్పేస్ సైంటిస్ట్‌గా ఉన్నారు.
“మేము ఎలినా, శిల్పి. మేమిద్దరమూ స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ రంగాల్లో విస్తృత అవకాశాలను చూస్తున్నాను. అణు సాంకేతికత వంటి రంగం- భారతీయ మహిళలకు ఇంతటి అవకాశాలని అందిస్తుందని మేము ఊహించలేదు. అదే విధంగా స్పేస్ టెక్నాలజీ రంగంలో, ప్రైవేట్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. నూతన ఆవిష్కరణలకు భారతదేశం ఒక వేదిక అవుతోంది. మన భారతీయ మహిళలకు కచ్చితంగా గొప్ప ప్రతిభ ఉంది. వారి విజయవంతమైన ప్రయాణానికి ఇది కచ్చితంగా సరైన వేదిక అవుతుంది” అని వివరించారు.
ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థపకురాలు, సీఈఓ అజైత షా. దాదాపు 35వేల మంది మహిళలను డిజిటల్ ఎనేబుల్డ్ ఆంత్రపెన్యూర్స్గా మార్చింది. అంటే గ్రామీణ మహిళలకు డిజిటల్ ప్లాట్ఫారమ్స్పై అవగాహన కల్పించి, వారే స్వయంగా వ్యాపార యజమానులుగా మారేలా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోలని నిత్యావసర వస్తు, సేవలను చివరి కస్టమర్ వరకు చేరేలా చేశారు. దీని ద్వారా గ్రామీణ మార్కెట్లకు, ఆర్థిక వృద్ధికి మధ్య ఉ్న అంతరాన్ని తగ్గించారు.
“ఆర్థికంగా సాధికారత సాధించిన మహిళ ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటుంది. స్వతంత్ర ఆలోచనాపరురాలుగా ఉంటుంది. తన భవిష్యత్‌కు తనే రూపశిల్పిగా ఉంటుంది. ఆధునిక భారత నిర్మాత అవుతుంది. మన దేశం ఆర్థిక సాధికారిత సాధించిన మహిళలను తయారుచేయడంలో ముందంజలో ఉంది” అని ఆమె తెలిపారు.\
“నా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రధాన సమస్య- గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు. అవి ఆర్థికమైనవి కావచ్చు లేదా మౌలిక సదుపాయాలకు సంబంధించినవి కావచ్చు. అందుకే వాటిని వీలైనంతగా తగ్గించడానికి నేను గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్నాను. నేను చాలా వరకు మార్పు తీసుకురాగలిగాను. అంతేకాదు చాలా మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించడం చూస్తూ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను” అజైతా షా ట్వీట్ చేశారు.
డాక్టర్ అంజలీ అగర్వాల్ ప్రముఖ న్యాయవాది సమర్థ్యం సెంటర్ ఫర్ యూనివర్సల్ యాక్సెస్బిలిటీ వ్యవస్థాపకురాలు. ఆమె తన 3 దశాబ్దాల కెరీర్లో భారతదేశం అంతటా పాఠశాలలు, పబ్లిక్ ప్లేస్‌లను దివ్యాంగులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
“ప్రతి స్త్రీ, ప్రతి వ్యక్తి, వారివారి జీవితాలను గౌరవంగా, స్వాతంత్ర్యంగా తీర్చుదిద్దుకోగలరని నిర్ధరణ చేసుకుందాం. దివ్యాంగుల జీవితాలను మెరుగుపరుద్దాం” అని ఆమె పిలుపిచ్చారు.
స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీలనూ మహిళలు రాణిస్తున్నారు. భారతీయ యువ శాస్త్రవేత్తలు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు మోదీ అకౌంట్ నుంచి పోస్టు చేశారు. న్యూక్లియర్ సైంటిస్టు ఎలీనా, స్పేస్ సైంటిస్టు సోనీ కూడా వుమెన్స్ డే సందర్భంగా పోస్టు చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇండియా కేంద్రంగా నిలుస్తుందన్నారు. సైన్స్ రంగంలోకి మరింత మంది మహిళలు రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

More Stories
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు