
* కేంద్ర నిధులకోసం ఉమ్మడి పోరాటం కోసమై పిలుపు
రాష్ట్రంపై రావాల్సిన నిధులు, హామీలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‍లో శనివారం జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో బీజేపీ, బిఆర్ఎస్ ఎంపీలు హాజరు కాలేదు. కేవలం కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రానికి పంపేందుకు మెుత్తం 28 అంశాలపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని పేర్కొంటూ ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు భట్టి చెప్పారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లతో పాటు బిజెపి ఎంపీలు అందరిని ఈ సమావేశానికి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ ఆలస్యంగా అందడంతో పార్టీలో చర్చించుకునే సమయం లేదని, ఇప్పటికే తమకు ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఖరారు కావడంతో హాజరు కాలేకపోతున్నామని కిషన్ రెడ్డి ప్రత్యుత్తరం ఇచ్చారు.
అలాగే బిఆర్ ఎస్ పార్టీ సైతం ఆకస్మికంగా సమావేశం పెట్టడంతో హాజరుకాలేకపోతున్నామని , మరోసారి ఇటువంటి సమావేశం నిర్వహిస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలని భట్టిని ఆ పార్టీ కోరింది. భవిష్యత్ లో సమావేశం నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగా తెలియజేయగలరని పేర్కొంటూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మెట్రో రెండో దశ, మూసీ రివర్ అభివృద్ధి ప్రాజెక్ట్, బేపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం సహా పలు ప్రధాన అంశాలను 28 అంశాలలో పొందుపర్చారు.
ఆ 28 అంశాలు ఇవే..
- ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఆమోదం, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ రేడియల్ రోడ్ల అభివృద్ధి
- మెట్రో రెండో దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, బేపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం
- గోదావరి-మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్
- వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకూ గ్రీన్‌ఫీల్డ్ హైవే
- ఎస్‍సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, ఐపీఎస్ కేడర్ సమీక్ష
- పీఎస్‍డీఎఫ్ కింద పథకాల మంజూరు, పీఎం కుసుమ్-ఏ, బీ, సీ కింద కేటాయింపు
- తాడిచెర్ల బొగ్గు బ్లాక్-II మైనింగ్ లీజు, వివిధ కార్పొరేషన్లు/ఎస్‍పీవీల రుణ పునర్నిర్మాణం
- వర్తించే ఇంటర్‌తో GOTGకి చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని విజ్ఞప్తి
- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద GoTGకి చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల కోసం అభ్యర్థన
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి సీఎస్ఎస్ నిధుల విడుదలలో లోపాన్ని సరిదిద్దమని అభ్యర్థన
- ఏపీబిల్డింగ్, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధిలో తెలంగాణకు వాటా కోసం నిధులను బదిలీ చేయాలని అభ్యర్థన
- ఏపీ పవర్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన మొత్తానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, రాష్ట్రంలో రైళ్ల కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి
- ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వెనకబడిన ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం
- పీఎం మిత్రా పార్క్ పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు
- అన్‌కవర్డ్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు