
భారీ టూరిజం ప్రాజెక్టుల (లార్జి, మెగా, అల్ట్రా మెగా) ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ సంస్థలకు సర్వహక్కులతో (ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన) భూములను అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ‘టూరిజం ల్యాండ్ అలాంట్‌మెంట్ పాలసీ-2024’ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో టూరిజం ప్రాజెక్టులకు భూముల కేటాయింపుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాలసీ చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కేబినెట్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన టూరిజం పాలసీకి కొనసాగింపుగా తాజా భూ కేటాయింపుల పాలసీని రూపొందించారు. టూరిజం ప్రాజెక్టుల కోసం ఎటువంటి వివాదాలే లేని భూమిని భూమిని ఇవ్వాలని టూరిజం పాలసీలో పేర్కొనగా, తాజాగా భూ కేటాయింపుల పాలసీలో ప్రాజెక్టుల వారీగా ఎన్ని ఎకరాలు కేటాయించాలి, ఏ పద్దతిలో కేటాయించాలన్న విషయాలను పేర్కొన్నారు.
రూ. 50 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు పెట్టుబడులతో వచ్చే టూరిజం ప్రాజెక్టులను లార్జ్ ప్రాజెక్టులుగాను, రూ. 250-నుండి రూ. 500 కోట్ల పెట్టుబడులను మెగా, రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చే వాటిని అల్ట్రామెగా ప్రాజెక్టులుగా విభజించారు.
ఈ తరహా సంస్థలకు 66+33 సంవత్సరాల పాటు భూమిని కేటాయించాలని పాలసీలో పేర్కొన్నప్పటికీ ఫ్రీ హోల్డ్ ప్రాతిపదక ఒకసారి అప్పగించిన తరువాత కాల వ్యవధికి పెద్దగా విలువ లేదని, సర్వ హక్కులు ఆ సంస్థలకు దఖలు పడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా ఏ తరహా టూరిజం ప్రాజెక్టుకు ఎన్ని ఎకరాలు భూమిని కేటాయించా లన్నది కూడా ఈ పాలసీలో పేర్కొన్నారు.
అయితే, భారీ పెట్టుబడులతో వచ్చే కార్పొరేట్ సంస్థలకు చేసే భూ కేటాయింపులపై ఎటువంటి పరిమితి విధించలేదు. ‘ప్రభుత్వం నిర్ణయించిన విధంగా’ అని పాలసీలో పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఇ ప్రాజెక్టులకు బిడ్డింగ్ ప్రాతిపదికన భూములు కేటాయించాలని, భారీ ప్రాజెక్టులకు వారు కోరుకున్న చోట రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపిబి) ద్వారా నేరుగా కేటాయించనున్నారని తెలిసింది.
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను రేషనలైజేషన్ చేయాలనికూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ శాఖలు అని అజెండాలో అన్నప్పటికీ సచివాలయ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని భావిస్తున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ నుండి ఈ ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
మెరుగైన సేవలందించేందుకు జిల్లా పంచాయితీ అధికారులు, ఎక్సటెన్షన్ అధికారుల ఉద్యోగాలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను కూడా రేషనలైజేషన్ చేయాలని పేర్కొనట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎక్కువగా దృష్టి పెట్టే ఆర్థికాభివృద్ధి మండలిలోనూ కొత్త ఉద్యోగాలను కల్పిరచేరదుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది. ఈ మండలిలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 కీలక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయిరచారు.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!