మణిపూర్ సమస్యపై పరిష్కారం కోరుతున్న ప్రధాని

మణిపూర్ సమస్యపై పరిష్కారం కోరుతున్న ప్రధాని

మణిపూర్ లోని సమస్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణాత్మక పరిష్కారం కోరుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జాతి హింస ఫలితంగా ఏర్పడిన సమస్యను ప్రభుత్వం తీర్చడానికి కృషి చేస్తోందని పేర్కొంటూ మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ మణిపూర్‌కు వెళ్లకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన  తోసిపుచ్చారు. “సమస్య ఉన్న ప్రదేశాన్ని సందర్శించడం కంటే, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం ముఖ్యం” అని రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని సందర్శించి ప్రకటనలు చేయడం కాదు, పరిష్కార మార్గాలను అన్వేషించడమే ఆయన లక్ష్యం అని తెలిపారు. 

గతంలో మణిపూర్ లో పెద్ద ఎత్తున హింస జరిగినప్పుడు కేవలం జాయింట్ సెక్రటరీ మాత్రమే ఒక రోజు పర్యటన చేసేవారని ఆయన గుర్తు చేశారు. మణిపూర్ సమస్య పరిష్కారానికి హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో నాలుగు రోజులు గడిపి, శాంతి కోసం విజ్ఞప్తి చేశారని రిజిజు వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రశ్నను సమగ్రంగా అర్థం చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేస్తోందని చెప్పారు. మోదీ, అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించడం వల్ల సమస్య పరిష్కారానికి మార్గం సుగమమవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, మణిపూర్‌లో గవర్నర్ ఆయుధాలను అప్పగించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారని తెలిపారు.

“ఆయుధాలు అప్పగించబడుతున్నాయి… శుభవార్త వస్తోంది” అని అని పేర్కొన్నారు.ప్రభుత్వ చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.  గత దశాబ్దంలో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అభివృద్ధి సాధించిందని, ప్రధాని మోదీ ఈశాన్య భరత్ కు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని రిజిజు చెప్పారు. “మోదీ  ప్రభుత్వం ఈ ప్రాంత భవిష్యత్తుకు కట్టుబడి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు” అని తెలిపారు. 

 
గత 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిదాన్ని, బీజేపీ 10 ఏళ్లలో సాధించిందని కిరణ్ రిజిజు తెలిపారు. మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతమైందని, కాంగ్రెస్ హయాంలో అలాంటి పురోగతి సాధ్యం కాలేదని తెలిపారు.