
నటి రన్యా రావు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. తాను 17 బంగారం బార్స్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.‘‘నేను ఐరోపా, అమెరికా, మధ్యప్రాచ్యం, దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించా’’ అని ఆమె తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తాను కేఎస్ హెగ్డేష్ అనే రియల్ఎస్టేట్ వ్యాపారి కుమార్తెనని, తన భర్త జతిన్ హుక్కేరి ఒక ఆర్కిటెక్ట్ అని వెల్లడించింది.
తన విచారణ న్యాయబద్ధంగా సాగుతోందని, ఎలాంటి ఒత్తిడి లేకుండా తను వాగ్మూలం ఇస్తున్నట్టు కూడా స్పష్టంగా వెల్లడించింది. తనకు కస్టడీలో ఉండగా ఆహారం ఇచ్చినా ఆకలి లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్టు పేర్కొంది. బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజెలిజెన్స్ అధికారులకు సమాచారం అందడంతో వారు బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యా రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఆర్థిక నేరాల విచారణ కోర్టు ఆమెకు మార్చి 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కాగా, అంతకుమునుపు కోర్టు విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారులు నటి కస్టడీని తమకు అప్పగించాలని కోరారు. మార్చి 9 తర్వాత మూడు రోజుల పాటు ఆమెను విచారించేందుకు అనుమతించాలని కోరారు.
ఆమె వెనక భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ ఉందేమో వెలికి తీయాల్సిన అవసరం ఉందని కోర్టుకు నివేదించారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ బయటపడలేదని డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. తన ఒంటికి బంగారు బిస్కెట్లను అంటించుకుని, ఎవరికీ కనబడకుండా దుస్తుల్లో దాచి రన్యా రావు స్మగ్లింగ్‌కు ప్రయత్నించింది.
గతేడాదిలో ఆమె ఏకంగా 30 సార్లు దుబాయ్‌కు స్వల్ప కాలిక పర్యటనలపై వెళ్లి వచ్చింది. తన సవితి తండ్రి, సీనియర్ పోలీసు అధికారి కే రామచంద్రరావు వీఐసీ హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్‌పోర్టులో తనిఖీలను తప్పించుకుని స్మగ్లింగ్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం