 
                నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకుంది. విజయానికి చేరువలో ఉండగా హార్దిక్ పాండ్యా ఔటయినా 49వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ వేసిన తొలి బంతిని కేఎల్ రాహుల్ సిక్సర్‌గా మలచడంతో 267 పరుగులతో టీం ఇండియా విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో ఛేదించింది. రాహల్ (42*) మ్యాచ్ ముగించాడు. విరాట్ కోహ్లీ (84 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, అయ్యర్ (45) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
265 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ (8) ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (28 పరుగులు), అక్షర్ పటేల్ (27 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో హార్దిక్ పాండ్య (28 పరుగులు) రాణించాడు.
స్పిన్‌కు జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి గట్టి పునాది వేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా 84 పరుగులతో టీం విజయంలో కీలక పాత్ర పోషించారు. 45 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఔటయినా, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టు విజయానికి బాటలు వేశాడు.
కోహ్లీ 84 పరుగుల్లో ఐదు ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులతో పర్వాలేదనిపించారు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ తర్వాత నిలకడగా ఆడుతూ హార్దిక్ పాండ్యా 28 పరుగుల వద్ద ఎల్లిస్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.
హార్దిక్ పాండ్యా స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ ఫినిష్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడం జంపా రెండేసి వికెట్ల చొప్పున, బెన్ డ్వార్‌షుయిస్, కూపర్ కొనొల్లీ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73 పరుగులు), అలెక్స్ కేరీ (61 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ (39 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2, అక్షర్ పటేల్. హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు.
తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక బుధవారం జరగనున్న రెండో సెమీస్ (న్యూజిలాండ్- సౌతాఫ్రికా) విజేతతో టీమ్ఇండియా ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!