పరిషత్ బలం పెరిగితే మతమార్పిడులు ఆగిపోతాయి

పరిషత్ బలం పెరిగితే మతమార్పిడులు ఆగిపోతాయి
గ్రామస్థాయిలో విశ్వహిందూ పరిషత్ బలం పెరిగితే మతమార్పిడిలు ఆగిపోతాయని ఆ సంస్థ నాయకులు స్పష్టం చేశారు.  హిందూ సమాజంపై విద్వేషపూరిత కుట్రలు కొనసాగుతున్న ఈ సందర్భంలో, వాటిని తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసి, కుటుంబ విలువలను పరిరక్షించాలని వివరించాలని పిలుపిచ్చారు.
 
అన్నోజిగూడాలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్ర అధ్యక్షులు బి. నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ధర్మరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ను విస్తరించాలని నిర్ణయించారు. గ్రామాలు, తండాలు, గిరి ప్రాంతాలలో కూడా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. 
 
పరిషత్ అఖిలభారత సంఘటన సహ కార్యదర్శి  వినాయకరావు దేశ్ పాండే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, దక్షిణ భారత  సంఘటన కార్యదర్శి  స్థాను మలయన్ , భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల్ల సత్యం, భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ మార్గదర్శనం చేశారు. రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ నారాయణ కార్యక్రమాలను నిర్వహించారు.
 
తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. పిల్లల అలవాట్లు, వ్యవహారంపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ప్రతి హిందూ కుటుంబంలో జనాభా పెంచేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ జనాభా తగ్గితే ఎదురయ్యే సమస్యలు, ప్రమాదాలపై వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. 
 
కులాల మధ్య అంతరాలను చెడిపేసి, సామాజిక సమరసతను కాపాడాలని,  ప్రతి వ్యక్తిలో భారతీయత, స్వదేశీ భావజాలం కలిగి ఉండాలని తెలిపారు.  ప్రతి హిందువు చైతన్యవంతమై మతమార్పిడి, లవ్ జిహాద్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని నాయకులు అభిప్రాయపడ్డారు. మూడు రోజులపాటు కొనసాగిన  పరిషత్  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రంలోని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఆపై స్థాయి బాధ్యతగల కార్యకర్తలు హాజరయ్యారు