
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పునరాగమనంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. చాలా రోజులుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌లో (100 నాటౌట్) శతకొట్టాడు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ కాగా, అంతర్జాతీయంగా 82వ సెంచరీ. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (20), ఓపెనర్ శుభమన్ గిల్ (46), శ్రేయస్ అయ్యార్ (56 తొలి ఛాంపియన్ షిప్ ఫిఫ్టీ) కీలక ఇన్నింగ్ ఆడారు. పైగా, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సాధించాడు. పాకిస్తాన్ పై మూడు కీలకమైన ఆటలలో శతకం సాధించిన ఏకైక క్రీడాకారుడిగా నిలిచాడు.
ఇప్పటికే ఆసియా కప్, ప్రపంచ కప్ లలో పాకిస్తాన్ పై శతకం సాధించగా, తాజాగా ఛాంపియన్ ట్రోఫీలో కూడా సాధించాడు. ఛాంపియన్ ట్రోఫీలో కోహ్లీ సాధించిన మొదటి శతకం ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఈ రికార్డ్ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి కోహ్లీ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఈ రికార్డ్ సాధించడానికి విరాట్ కోహ్లీ 299 వన్డే మ్యాచ్‌లలో 287 ఇన్నింగ్స్‌లు ఆడాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో కోహ్లీ అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేయడం విశేషం. ఇక సచిన్ టెండూల్కర్ 14 వేల పరుగులు పూర్తి చేయడానికి 350 ఇన్నింగ్స్‌లు, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ ఈ రికార్డును పాకిస్తా్న్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన తర్వాత తన పేరిట ఈ రికార్డు లిఖించుకున్నాడు.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 14 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడమే కాకుండా, భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. అజారుద్దీన్ 156 క్యాచ్‌లు అందుకోగా, తాజాగా కోహ్లీ 158 క్యాచ్‌లు అందుకుని ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 140 క్యాచ్‌లు, రాహుల్ ద్రవిడ్ – 124 క్యాచ్‌లు, సురేష్ రైనా – 102 క్యాచ్‌లు సాధించారు.
కోహ్లీ సెంచరీ కొంత నాటకీయతతో సాధించాడు. అతను తన మూడు అంకెల మార్కును చేరుకునే సమయానికి, భారతదేశం వద్ద ఎక్కువ పరుగులు మిగిలి లేవు. హార్దిక్ పాండ్యా బలమైన ఉద్దేశ్యంతో8 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ సెంచరీకి నాలుగు పరుగులు, భారతదేశం విజయానికి రెండు పరుగులు అవసరం కాగా, మాస్ట్రో బ్యాటర్ కవర్స్ వైపు ఒక పంచ్ కొట్టి సెంచరీ సాధించి, చేతిలో ఆరు వికెట్లు, 45 బంతులు మిగిలి ఉండగానే భారతదేశాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.
కోహ్లీ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే 299 మ్యాచ్‌లలో 287 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 57.79 అద్భుతమైన సగటుతో 14001 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ 50 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు. ఇది శ్రీలంకపై నమోదు చేశాడు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు