డ్రగ్స్ వాడకం పెరగడంతో విద్యాలయాల్లో ర్యాగింగ్ ఘటనలు

డ్రగ్స్ వాడకం పెరగడంతో విద్యాలయాల్లో ర్యాగింగ్ ఘటనలు

ఇటీవలి కాలంలో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ ఘటనలు పెరిగిపోతున్నాయి. గత కొన్నిరోజుల్లోనే కేరళ, ఏపీ, జమ్మూకాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ర్యాంగింగ్‌ ఘటనలు వెలుగు చూశాయి. సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను వేధించడం వల్ల వారు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. చట్టప్రకారం ర్యాగింగ్‌ నేరం. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. 

ర్యాగింగ్‌ వల్ల కొంతమంది విద్యార్థులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. మరికొంతమంది చదువులకు దూరమౌతున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు స్పందిస్తున్నప్పటికీ  ర్యాంగింగ్‌ను పూర్తిగా నిలువరించలేకపోతున్నాయి. గత ఐదేళ్లలో అత్యధికంగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్‌ ఘటలు ఏడాదికేడాది పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

విద్యలో హింసకు వ్యతిరేకంగా పనిచేసే సేవ్‌ అనే ఎన్‌జీవో సంస్థ సర్వే ప్రకారం భారత్‌లో 2020లో 226, 2021లో 546, 2022లో 1,103, 2023లో 964, 2024లో 1,086 ర్యాగింగ్‌ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎఐసిటియు (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ 2021 నుంచి 2024 వరకు కేవలం మూడు నుంచి 11 కేసుల్లో ప్రశ్నించడం జరిగింది. 

యుజిసి (యూనివ్‌ ట్రాంట్స్‌ కమిషన్‌) 2020లో 5 కేసుల నుంచి మొదలై.. 2024 వరకు 17 కేసుల్లో మాత్రమే విచారించడం జరిగింది. ఇక ఈ ఏడాది(2025)లో 2 కేసుల్లో మాత్రమే ప్రశ్నించడం జరిగింది. ఐఎన్‌సి (ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌) 2020 నుంచి కేవలం 2 కేసుల్లో, ఇక 2025లో ఒక్క కేసులో ప్రశ్నించడం జరిగిందని సేవ్‌ సంస్థ సర్వే తెలియజేస్తోంది.

2020లో 16 కేసుల్లో అబ్బాయిలు 14, అమ్మాయిలు 2, 2021లో 14 ఘటనల్లో అబ్బాయిలు 13, అమ్మాయిలు : 1, 2022లో నమోదైన 39 కేసుల్లో అబ్బాయిలు 33, అమ్మాయిలు 6, 2023లో 30 అబ్బాయిలు 24, అమ్మాయిలు 5, ట్రాన్స్‌జెండర్‌ 1, 2024లో నమోదైన 43 కేసుల్లో అబ్బాయిలు, 38, అమ్మాయిలు : 5, 2025లో 6 అబ్బాయిలు 5, అమ్మాయిలు ఒక్క ఘటనలో ర్యాగింగ్‌కి పాల్పడ్డారని సేవ్‌ సర్వే లెక్కలు చెబుతున్నాయి.

కులం పేరుతోనో, లేక పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులకు చెందిన విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడం కంటే డ్రగ్స్‌ వాడకం పెరిగినందు వల్లే ర్యాగింగ్‌ పెరిగిపోతుందని కొంతమంది యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌లు తెలిపారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రహస్యంగా డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరిగింది. వీటిని అరికట్టేందకు పూనుకుంటున్నా పెద్ద ఫలితాలనివ్వలేదని లెక్కలను బట్టే తెలుస్తోంది. విద్యార్థులు డ్రగ్స్‌కి అడిక్ట్‌ అయి డబ్బుల కోసం, మత్తుపదార్థాల కోసం ర్యాగింగ్‌కి పాల్పడతున్నారని అధ్యాపకులతోపాటు, పలువురు విద్యార్థులు కూడా అభిప్రాయపడుతున్నట్లు సేవ్‌ సంస్థ సర్వేలో తేలింది.