
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్లతో అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని గురువారం ఆయన అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ట్రంప్‌తో పాటూ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో సహా పలువురు నేతలతో కూడా అయ్యారు.
భారతదేశం-యుఎస్ సంబంధాలలో ముఖ్యమైన అంశాలైన రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలపై మైఖేల్ వాల్జ్ తో చర్చించారు. “ఆయనతో ఫలవంతమైన సమావేశం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ భారతదేశానికి గొప్ప స్నేహితుడు” అని ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. “రక్షణ, సాంకేతికత, భద్రత భారతదేశం- అమెరికా సంబంధాలలో ముఖ్యమైన అంశాలు. ఈ సమస్యల గురించి మేము అద్భుతమైన చర్చను నిర్వహించాము. ఏఐ, సెమీకండక్టర్లు, అంతరిక్షం, మరిన్ని రంగాలలో సహకారానికి బలమైన అవకాశం ఉంది” అని ఆయన తెలిపారు.
వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మైఖేల్ వాల్జ్, తులసి గబ్బార్డ్లతో మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య గల వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిఘా సహకారాన్ని మరింత పెంచాల్సిన అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
సైబర్ భద్రతతో సహా ముంచుకువస్తున్న పలు ముప్పులను ఎదుర్కొనడంలో కూడా సహకారం వుండాలని పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత నిఘా అధికారిగా బాధ్యతలు చేపట్టిన హిందూ అమెరికన్ తులసి గబ్బార్డ్ను మోదీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కోరారు.
అమెరికా అధ్యక్షుడి అతిథి గృహమైన బ్లెయర్ హౌస్‌లో బస చేసిన మోదీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. వాల్ట్జ్ తో సమావేశం తర్వాత, ప్రధాని మోదీ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తో సమావేశమయ్యారు. మస్క్ తన ముగ్గురు చిన్న పిల్లలతో బ్లెయిర్ హౌస్ కు చేరుకున్నారు.
More Stories
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్