అక్రమ వలసదారులపై ట్రంప్ విధానంపై పొప్ మండిపాటు

అక్రమ వలసదారులపై ట్రంప్ విధానంపై పొప్ మండిపాటు

అక్రమ వలసదారుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాన్ని పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోని బిషప్‌లకు పంపిన లేఖలో ట్రంప్ వలస విధానాన్ని పోప్ విమర్శించారు. అక్రమ వలసదారులందరూ నేరస్థులు కాదని స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు వలస వెళతారని చెప్పుకొచ్చారు.

 అలాంటి వ్యక్తుల గౌరవమర్యాదులకు విలువ ఇవ్వాలని పాప్ హితవు చెప్పారు. వలసదారుల బహిష్కరణ వార్త నిజమైతే, అది విపత్తుగా ముగుస్తుందని, అక్రమ వలసదారుల సమస్యను సరిదిద్దడానికి ఇది మార్గం కాదని పోప్ హెచ్చరించారు.  అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణను చూడబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పేర్కొన్నారు. 

ఇందులో భాగంగా, యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) సుమారు 15 లక్షల మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది. నవంబర్ 2024లో ఐసిఇ విడుదల చేసిన డేటా ప్రకారం, అమెరికాలోని 1.5 లక్షల మందిలో 17,940 మంది భారతీయులున్నారు.

అమెరికాలోని 30,000 మంది అక్రమ వలసదారులను క్రూరత్వానికి పేరుగాంచిన గ్వాంటనామో నిర్బంధ శిబిరానికి బదిలీ చేసే ఉత్తర్వుపై  ట్రంప్ సంతకం చేశారు. వారిని గ్వాంటనామో నిర్బంధ శిబిరంలో ఉంచడానికి సౌకర్యాలను సిద్ధం చేయాలని, రక్షణ, హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలిపారు.

 గ్వాంటనామో బేలోని యుఎస్ సైనిక స్థావరం వద్ద ఉన్న గరిష్ట భద్రతా జైళ్లలో ఉగ్రవాదులు సహా నేరస్థులు ఉన్నారు. భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనకు బాధితులు గురౌతున్నారు.