
బందీల విడుదల విషయంలో హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. శనివారం నాటికి మిగిలిన బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. అంతేకాకుండా కాల్పుల విమరణ ఒప్పందం రద్దు కోసం ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తాని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, తదుపరి బందీల విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తామని హమాస్ ఇటీవల ఓ ప్రటనను విడుదల చేసింది. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘హమాస్ చర్య భయంకరమైనది. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయం. కానీ, నాకు సంబంధించినంత వరకు శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలి. లేకపోతే నరకం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తా. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడతా’ అని ట్రంప్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా మరోవైపు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటాని ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రకటనను పాలస్తీనియన్లు తిరస్కరిస్తున్నారని, వారికి తము మద్దతిస్తామని ఈజిప్టు విదేశాంగశాఖ మంత్రి బాదర్ అబ్దెలాటి పేర్కొన్నారు. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోకు తెలిపిన్నట్లు చెప్పారు.
దీనిపై స్పందించిన ట్రంప్, పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరించారు. ఇక, ఈ వారంలో ట్రంప్‌తో జోర్దాన్ రాజు అబ్దుల్లా 2 భేటీ కానున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 19 నుంచి ఇప్పటివరకు ఇరుపక్షాల మధ్య 5 సార్లు పరస్పరం బందీలు, పాలస్తీనీయుల విడుదల జరిగింది. 21 మంది బందీలను హమాస్ విడుదల చేయగా, బదులుగా 730 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తదుపరి విడుదల ప్రక్రియ శనివారానికి నిర్ణయించగా హమాస్,ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తామని ప్రకటిచింది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?