గడిచిన 5 ఏళ్ళలో ఎపిలో విధ్వంస పాలన

గడిచిన 5 ఏళ్ళలో ఎపిలో విధ్వంస పాలన
 
గడిచిన 5 ఏళ్ళలో ఎపిలో విధ్వంస పాలన సాగిందని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. గడిచిన ఐదు సంవత్సరాలలో విధ్వంసానికి, కక్షలతోనే వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం కేవలం తమ జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించిందని ఆమె ధ్వజమెత్తారు.
 
ఆదివారం ఆమె సమక్షంలో విశాఖపట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వాసుపల్లీ సంతోష్‌ కుమార్‌ బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  పురంధరేశ్వరి మాట్లాడుతూ  ఢిల్లీ లో 27 సంవత్సరాలు తరువాత బీజేపీ జెండా ఎగిరిందని, ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ ఘన విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు. 
 
ఏపీలో కూడా గత ఏడాది రాష్ట్ర ప్రజలు కూటమికి అనూహ్య విజయం అందిచారని ఆమె గుర్తుచేశారు. ఢిల్లీ లో మద్యం స్కాం మాదిరిగా రాష్ట్రంలో కూడా స్కాం జరిగిందని ఆరోపించారు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తి తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బిడ్జెట్‌ ను పెట్టడం జరిగిందని ఆమె చెప్పారు. 
 
కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదని పేర్కొంటూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే అభివఅద్ధి ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ ఉదాహరణ అని ఆమె తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని పురందేశ్వరి భరోసా ఇచ్ఛారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
 
గడిచిన ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని, 2014 నుండి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమరావతి నిర్మాణానికి ఇప్పడు రూ.15,000 కోట్లు ఆర్థిక సాయం కూడా చేశామని ఆమె పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బ్రిటిష్‌ కాలం లో పెట్టిన వాల్తేర్‌ డివిజన్‌ ను విశాఖపట్నం డివిజన్‌ గా మార్చామని, వైఎస్‌ఆర్సీపీ హయాంలో రోడ్లు దయనీయ స్థితిలో ఉండేవని వాటిని రూ.4800 కోట్లు పంచాయితీ రాజ్‌ నిధులతో మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేకే లైన్‌ , అరకు రైల్వే స్టేషన్‌ సమస్య ని ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దఅష్టి తీసుకువెళ్ళడం జరిగిందని, వారు పరిశీలిస్తామని మంత్రి చెప్పారని చెప్పారు. అరకు రైల్వేస్టేషన్‌ ను వదులుకొనే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు. విశాఖ డివిజన్‌ లో కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.