
మ్మెల్యేలకు రూ.1,542 కోట్ల ఆస్తులు
కొత్తగా ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేలకు మొత్తం రూ.1,542 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఈ లెక్కన ప్రస్తుతం డిల్లీలోని ఒక్కో ఎమ్మెల్యేకు సగటున రూ.22.04 కోట్ల ఆస్తి ఉంది. 2020లో ఢిల్లీ ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి విలువ కేవలం రూ.14.29 కోట్లే. అంటే ఈసారి ఎన్నికల్లో మరింత సంపన్నులే పోటీ చేశారు.
ఆస్తులపరంగా బీజేపీ ఎమ్మెల్యేలే టాప్‌లో ఉన్నారు. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.28.59 కోట్లుగా ఉంది. ఆప్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.7.74 కోట్లే. రూ.115 కోట్ల నుంచి రూ.259 కోట్ల రేంజులో ఆస్తిపాస్తులను కలిగిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారు. ఇక ఇదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆస్తి విలువ రూ.20 లక్షలలోపే ఉంది.
ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 44 శాతం మందికి రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. కేవలం 3 శాతం మందికే రూ.20 లక్షలలోగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు తమకు రూ.1 కోటికిపైగా అప్పులు ఉన్నాయని ప్రకటించారు.
అప్పుల విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈయనకు ఏకంగా రూ.74 కోట్ల అప్పులు ఉన్నాయట. అత్యంత సంపన్న బీజేపీ ఎమ్మెల్యేల్లో కర్నైల్ సింగ్ (రూ.259.67 కోట్లు), మంజీందర్ సింగ్ సిర్సా (రూ.248.85 కోట్లు), పర్వేశ్ వర్మ (రూ.115.63 కోట్లు) ఉన్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 64 శాతం మంది డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హతలను కలిగి ఉన్నారు. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నామని 33 శాతం మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ప్రకటించారు. కొత్త ఎమ్మెల్యేల్లో 67 శాతం మంది 41 నుంచి 60 ఏళ్లలోపువారు, 20 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.
2020 ఎన్నికల్లో 8 మంది మహిళలు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికవగా, ఈసారి ఐదుగురు వనితలే ఎన్నికయ్యారు. వివిధ పార్టీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వరుసగా మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరి సగటు ఆస్తులు 2020 ఎన్నికల నాటితో పోలిస్తే 25 శాతం మేర పెరిగి రూ.7.04 కోట్ల నుంచి రూ.8.83 కోట్లకు పెరిగాయి.
బీజేపీ తరఫున ప్రస్తుతం నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ నుంచి అతిశీ ఒక్కరే మహిళా ఎమ్మెల్యే. 2020లో ఆప్ నుంచి అత్యధికంగా 8 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. కొత్త ఎమ్మెల్యేలలో 61 శాతం మంది తమ ప్రొఫెషన్ రాజకీయాలు లేదా సామాజిక సేవ అని వెల్లడించారు. 2020 ఎన్నికల్లో 67 శాతం మంది ఈ విధమైన సమాచారమిచ్చారు.
బిజినెస్‌ను ప్రొఫెషన్‌గా వెల్లడించిన ఎమ్మెల్యేల సంఖ్య 29 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు వయసు 52 ఏళ్లు. ఈ వివరాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!