
అయితే, ఈ ఐడీకి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం, ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరినీ ఎన్పీసీఐ తాజాగా అలర్ట్ చేసింది.
కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఐడీలు ఉన్న ట్రాన్సక్షన్స్ను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఈ మేరకు జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూపీఐకి సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్స్కు అనుగూణంగా ఈ మార్పులు చేసినట్టు ఎన్పీసీఐ పేర్కొంది. కొద్ది మంది మినహా దాదాపుగా అందరూ భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగూణంగా మార్పులు చేసినట్టు కూడా ఎన్పీసీఐ పేర్కొంది.
ఇక తాజాగా డేటా ప్రకారం, గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. అంతకుముందు, నెలతో పోలిస్తే దాదాపు 8 శాతం మేర లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో రూ.23.25 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.
కాగా, యూపీఐ మోసాలపై కూడా ఎన్పీసీఐ మరో ప్రకటనలో చేసింది. ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ ఎక్కువయ్యాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్కా్మ్లల్లో సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో బాధితులకు డబ్బు బదిలీ చేసి ఆపై వారిని మాయచేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లల్లోకి బదిలీ చేయించుకుంటున్నారట.
దీనిపై స్పష్టత ఇచ్చిన ఎన్పీసీఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసినం మాత్రాన లావాదేవీకి అనుమతి లభించదని స్పష్టం చేసింది. యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఈ దశ దాటకుండా లావాదేవీ పూర్తయ్యే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చింది.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ