చైనా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ‘అపారమైన టారిఫ్‌ మేకర్లు’

చైనా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ‘అపారమైన టారిఫ్‌ మేకర్లు’
 
చైనా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ‘అపారమైన టారిఫ్‌ మేకర్లు’ అని అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటువంటి పద్దతులను తమ ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగనివ్వబోదని స్పష్టం చేశారు. ‘అమెరికా ఫస్ట్‌’ నినాదానికే తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇటువంటి పద్దతులను తన ప్రభుత్వం సుదీర్ఘకాలం అనుమతించబోదని తేల్చి చెప్పారు. 
 
అమెరికాకు నష్టం చేసే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ మరోసారి ప్రకటించారు. అయితే, బ్రెజిల్‌ బ్లాక్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూడు దేశాలు (చైనా, భారత్‌, బ్రెజిల్‌) తమ దేశాల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. ఫ్లోరిడా రీట్రీట్‌లో హౌస్‌ ఆఫ్‌ రిపబ్లికన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నిజంగా తమకు హాని చేసే దేశాలపై, ప్రజలపై సుంకాలు విధించబోతున్నాం. కానీ, ఆ మూడు దేశాల ప్రభుత్వాలు ఆయా దేశాలకు మంచి చేయాలని భావిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ సంభాషణలో ప్రపంచ శాంతి సుస్థిరతల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇరువురు నేతల మధ్య చర్చల్లో టారిఫ్‌ల అంశం చర్చకు వచ్చిందా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను వచ్చేనెల ప్రారంభంలో ప్రధాని నరేంద్రమోదీ కలుసుకోనున్నారు. 
 
భారత్‌ విధించే సుంకాలు వివాదాస్పదం, అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినా ఇండియా చాలా పెద్ద దుర్వర్తన కోరు అని ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. అమెరికాను మరింత సంపన్నంగా, శక్తిమంతంగా చేసేందుకు చాలా త్వరగా సరైన వ్యవస్థను రూపొందిస్తామని ప్రకటించారు. తమ పౌరులను సంపన్నులను చేయడానికి విదేశాలపై సుంకాలు, పన్నులు విధిస్తామని వెల్లడించారు.