
“దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతుంటే పాలనా వ్యవస్థలకు విఘాతం కలుగుతుంది. వికాసం మందగిస్తుంది. జమిలి ఎన్నికల విధానంతో ఈ సమస్యలన్నీ సమసిపోతాయి. పాలనా వ్యవస్థ అవాంతరాలు లేకుండా పనిచేయగలదు. ప్రభుత్వం మరింత ఫోకస్డ్‌గా పాలనలో ముందుకు సాగగలదు” అని మోదీ తెలిపారు.
“అమెరికాలాంటి దేశాల్లోనూ ప్రతి నాలుగేళ్లకోసారి జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. నూతన ప్రభుత్వాల ఏర్పాటు తేదీలను సైతం అక్కడి రాజ్యాంగంలో ఫిక్స్‌డ్‌గా పొందుపరిచారు” అని మోదీ చెప్పారు. “జమిలి ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీలో ఉన్నవాళ్లంతా లోతుగా చర్చించండి. భారతదేశ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలంటే మీరంతా చర్చించుకోవడం చాలా అవసరం” అని ప్రధాని పేర్కొన్నారు.
“1 లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని నేను ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను. కొత్త కొత్త ఆలోచనలు కలిగిన యువతకు రాజకీయాల్లో చోటు ఉంటుంది. యువత లేకుండా ప్రపంచ భవిష్యత్తును మనం ఊహించుకోలేం. ప్రపంచ హితాన్ని కోరే గొప్ప శక్తి యువతే” అని మోదీ పేర్కొన్నారు. “2014 నాటికి భారత్‌లో 14 లక్షల మంది ఎన్‌సీసీ కేడెట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. ఇందులో దాదాపు 8 లక్షల మంది బాలికలే” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
More Stories
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి