
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ జోరు కొనసాగుతోంది. భారత యువ మహిళలు వరుస విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. ఆదివారం సూపర్ సిక్స్ గ్రూప్-1లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి బంగ్లాను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టును భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగుల వద్ద కట్టడి చేసింది. బంగ్లా బ్యాటర్లలో సుమైయా అక్తర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కేవలం 7.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 64/8 వద్ద కట్టడి చేసిన టీమిండియా, ఈ స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 7.1 ఓవర్లలో ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 31 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లతో 40 పరుగులు రాబట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. జట్టు విజయానికి చేరువైన దశలో త్రిష ఔటయ్యింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిక్కీ ప్రసాద్ (5 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టింది. భారత్ తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్తో తలపడనుంది. బంగ్లా జట్టులో సుమైయా అక్తేర్ (21 *) టాప్ స్కోరర్. జన్నాటుల్ మౌవా (14) పరుగులు చేసింది. ఫహౌమిదా చోయా 2, ఎవా 2, సాదియా ఇస్లామ్ 5, సుమైయా అక్తర్ 5, అశిమా 7, నిశిత 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు.. షబ్నామ్, జోషిత, త్రిష తలో వికెట్ పడగొట్టారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?