
* కోట్ల మంది వస్తున్నా స్వచ్ఛమైన గాలి
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ఒకప్పుడు అగ్రతారగా వెలుగు వెలిగింది మమత కులకర్ణి. తాను నటించిన కరణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రేమ శిఖరంతో పాటు మోహన్ బాబు హీరోగా వచ్చిన దొంగా పోలీస్ చిత్రంలో నటించింది ఈ భామ.
అయితే అకస్మాత్తుగా తాను నటనకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసింది. ఇక 20 ఏండ్ల క్రితం నటనను వదిలేసి విదేశాల్లో వెళ్లి స్థిరపడింది మమత తాజాగా మహకుంభమేళలో కనపడడం, సన్యాసం తీసుకోవడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తుంది.
ఇలా ఉండగా, సాధారణంగా జనం ఎక్కువగా ఉన్న చోట ఆక్సిజన్ సరిగా అందదు. అందుకే ఊపిరాడక చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు. కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దానికి రెండేళ్ల ముందే యూపీ ప్రభుత్వం ప్రభుత్వం భక్తులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కసరత్తు చేసింది.
అందులో భాగంగా ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్లో మియవాకి అనే జపనీస్ పద్ధతిని ఉపయోగించి ఓ చిట్టడవిని తయారు చేసింది. కార్పోరేషన్‌లోని 10 ప్రదేశాల్లో 18.50 ఎకరాల భూమిలో 5 లక్షలకుపైగా మొక్కలను నాటింది. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగి ఇప్పుడు రోజూ సుమారుగా 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతున్నాయి.
ప్రస్తుతం అక్కడ ఒక్కో చెట్టు దాదాపు 25 నుంచి 30 అడుగుల ఎత్తుదాకా పెరిగాయి. ఒక్కో చెట్టు నుంచి రోజూ సగటున 230 లీటర్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ మియవాకి మెథడ్‌తో చెట్లను పెంచడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 63 రకాల మొక్కలను నాటారు.
ఈ 63 రకాల్లో మర్రి, రావి, వేప, మహువా, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రాహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ లాంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార మొక్కలన్నీ ఆ చిట్టడవిలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఈ చిట్టడవి నిర్వహణ కాంట్రాక్టును మూడేళ్ల వ్యవధి కోసం ఒక కంపెనీకి అప్పగించారు.
ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ నగర్ పార్క్, బాలూ మండి, అవంతిక కాలనీ, దేవఘాట్ పార్క్, ట్రాన్స్పోర్ట్ నగర్ పార్క్-2 తదితర ఏరియాల్లో ప్రభుత్వం పెంచిన చిట్టడవి విస్తరించి ఉన్నది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు