జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో జపాన్‌ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మియాజాకి ప్రిఫెక్చర్‌లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.26 గంటలకు భూకంపం సంభవించినట్లుగా జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. 

భూకంపంతో ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లుగా సమాచారం అందలేదు. భూమికి 37 కిలోమీట్ల లోతులో భూకంప కేంద్రం గురించినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ భూకంప కేంద్రం పేర్కొంది. వాస్తవానికి పసిఫిక్ బేసిన్‌లో తరుచూగా భూకంపాలు వస్తుంటాయి. గతేడాది ఆగస్టు 8న వరుస భూకంపాలు జపాన్‌ను వణికించాయి 6.9, 7.1 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చాయి.

క్యుషు, షికోకులో భూకంపాలు వచ్చాయి. గతేడాది జనవరి ఒకటిన సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం రాగా.. దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణమే అయినా.. అప్పుడప్పుడు భారీ భూకంపాలు వస్తుంటాయి. 

ఈ ఏడాది జనవరి 7న టిబెల్‌లో వరుస భూకంపాలు వచ్చాయి. దాదాపు 126 వరకు ప్రాణాలు కోల్పోగా.. చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. 300 మందికిపైగా గాయపడ్డారు. టిబెట్‌లోని టింగ్రి కౌంటీలో వచ్చిన భూకంపంతో భారత్‌, నేపాల్‌, భూటాన్‌లోనూ ప్రకంపనలు రికార్డయ్యాయి.  గతేడాది ఆగస్టు 8న వరుస భూకంపాలు జపాన్‌ను వణికించాయి 6.9, 7.1 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చాయి.

క్యుషు, షికోకులో భూకంపాలు వచ్చాయి. గతేడాది జనవరి ఒకటిన సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం రాగా.. దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణమే అయినా.. అప్పుడప్పుడు భారీ భూకంపాలు వస్తుంటాయి.

ఈ ఏడాది జనవరి 7న టిబెల్‌లో వరుస భూకంపాలు వచ్చాయి. దాదాపు 126 వరకు ప్రాణాలు కోల్పోగా.. చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. 300 మందికిపైగా గాయపడ్డారు. టిబెట్‌లోని టింగ్రి కౌంటీలో వచ్చిన భూకంపంతో భారత్‌, నేపాల్‌, భూటాన్‌లోనూ ప్రకంపనలు రికార్డయ్యాయి.