
కాగా, దీనికి ముందు గత డిసెంబర్ 24 నుంచి 29 వరకూ జైశంకర్ అమెరికాలో అధికార పర్యటన జరిపారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ట్రంప్ నామినీ మైఖేల్ వాల్ట్స్‌ను కలుసుకున్నారు. ట్రంప్ కొత్త అడ్మినిస్ట్రేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగిన తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో సహా పలు అంశాలపై జైశంకర్, వాల్ట్స్ ఈ సమావేశంలో చర్చించారు.
ట్రంప్-వాన్సె ఇనాగరల్ కమిటీ ఆహ్వానం మేరకు 47వ దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ఎస్.ట్రంప్ ప్రమాణస్వీకారానికి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్ తరఫున హాజరవుతున్నారని ఎంఈఏ తెలిపింది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఆ దేశ 45వ అధ్యక్షుడిగా 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకూ ఆయన తొలిసారి పగ్గాలు చేపట్టారు.
డొనాల్డ్ ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా హాజరుకానున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ – జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి అప్పట్లో గైర్హాజరయ్యారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు