
భారత్లోని రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ప్రస్తుతం రైల్వే సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ప్యాసింజర్ రైళ్లు మొదలు గూడ్స్ రైళ్లు, రాజధాని, శతాబ్ది, డురాంటో వందే భారత్ లాంటి అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు దేశ ప్రజానీకానికి విలువైన సేవలు అందిస్తున్నాయి.
ఇక భారత రైల్వేకు అత్యధిక ఆదాయం టిక్కెట్ అమ్మకాల నుంచే సమకూరుతుంది. అయితే, ప్రజాసంక్షేమం దృష్ట్యా టిక్కెట్లను భారతీయ రైల్వే 46 శాతం తక్కువ రేటుకు విక్రయిస్తుంది. దీంతో, పాటు వివిధ తరగతుల ప్యాసింజర్లకు ఇతర రాయితీలు అనేకం కల్పిస్తుంది. ఇలా దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైల్వే వార్షిక ఆదాయం సుమారు రూ.57 వేల కోట్లు. టిక్కెట్లతో పాటు రైల్వేకు సరకు రవాణా కూడా ఓ ప్రధాన ఆదాయ మార్గం.
అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు అన్నిటిలోకి కేఎస్ఆర్ రాజధాని ఎక్స్ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఢిల్లీ- బెంగళూరు మధ్య తిరిగే ఈ ఎక్స్ప్రెస్ 2022-23 సంవత్సరంలో రైల్వేకు అత్యధికంగా రూ.1760 కోట్ల ఆదాయాన్ని ఇచ్చింది. మొత్తం 509,510 ప్యాసింజర్లను వారి గమ్య స్థానాలకు తరలించింది.
కేఎస్ఆర్తో పాటు ఇతర రాజధాని సర్వీసులు కూడా రైల్వేకు చెప్పుకోదగ్గ ఆదాయాన్నే తెచ్చి పెడుతున్నాయి. ఢిల్లీ- కోల్కతా మధ్య నడిచే సియాల్దా రాజధాని ఎక్స్ప్రెస్ వార్షిక ఆదాయం 1288.18 కోట్లు. ఇక అస్సాం- ఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్ వార్షిక ఆదాయం రూ.1262 కోట్లు. ఇలా క్రమం తప్పకుండా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ ప్రీమియం సర్వీసులు రైల్వేకు అత్యంత కీలకంగా మారాయి.
ఇక దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్ప్రెస్ గుర్తింపు పొందింది. అస్సాంలని దిబ్రూగఢ్, తమిళనాడులోని కన్యాకుమారి మధ్య తిరిగే ఈ రైలు ఏకంగా 4286 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాదాపు మూడున్నర రోజుల్లో ఈ జర్నీని పూర్తి చేస్తుంది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా