నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వము రు 63 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిధులు విడుదల చేసింది.
ఆ నిధులలో గోల్మాల్ జరిగిందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రారంభించిన సోదాలు నేడు కూడా కొనసాగాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి చౌడేశ్వరి, డి ఈ, చంద్రశేఖర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి.
విజిలెన్స్ అధికారుల దాడుల్లో అవినీతి అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేవస్థానం పరిధిలో ఉన్న గణేష్ సదన్, నక్షత్రవనం సరిహద్దు గోడ ప్రాంతాల్లో జరిగిన నిర్మాణాల్లో అవుకతోకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయన్నారు. శ్రీశైలం అభివృద్ధికి ఇచ్చిన నిధులలో హలో అవినీతి జరిగిందని ఆరోపణల మేరకు ఈ దాడులు జరగటం విశేషం.
గత వైసిపి ప్రభుత్వం లోనే ఆనాటి మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆనాటి దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ల మధ్య స్టేజ్ పైననే పనుల విషయంలో ఘర్షణ జరిగిన వాతావరణాన్ని సోషల్ మీడియాలో చూసాం. ఆనాటి నుంచి శ్రీశైలమ అభివృద్ధి అవుకతోకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి.
ప్రస్తుత నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సైతం శ్రీశైలం దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగాయని, దుకాణాలలో వైసిపి అభ్యర్థులే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ అధికారి వివరణ కోసం ఫోన్లో సంప్రదించినప్పటికీ పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అనే రావడం విశేషం.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష