సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారు

సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారు
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌ రెడ్డి పగబట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. హీరో అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం చాలా బాధాకరమని, బాలుడు శ్రీతేజ్‌ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారని చెప్పారు. 
 
అయితే ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్‌లో సీఎం రేవంత్ స్టోరీ అల్లారని విమర్శించారు.  ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందని పేర్కొంటూ ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని  సంజయ్ హెచ్చరించారు.
 
ఈ సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడించారని,  సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.
 
సమస్య ముగిసిన తర్వాత కూడా సీఎం అసెంబ్లీలో మళ్లీ దీని గురించి మాట్లాడడం సరికాదని సంజయ్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారనని.. వారి కుటుంబాలను సీఎం రేవంత్ ఏనాడైనా రామర్శించారా? అని ప్రశ్నించారు. ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయా? అని సంజయ్ నిలదీశారు.
 
సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు రావడం 50 ఏళ్లుా షరా మామూలేనని చెప్పారు. పాన్ ఇండియా సినిమా బెన్ ఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కడూా సాధారణమేనని తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మాయక మహిళ బలైందని, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆ తప్పును ఇతరులపై నెట్టడం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు.