
‘ఎక్స్’ వేదికగా తాను ఇచ్చిన మాట ప్రకారం ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి, 101 సంవత్సరాల వయోవృద్ధుడు అయిన మంగళ్ సెయిన్ హండాను మోదీ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. తన తాత మంగళ్ హండా ప్రధాని వీరాభిమాని అని,కువైత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలిసి మాట్లాడాలని హండా మనవరాలు శ్రేయ జునేజా ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
తప్పకుండా కలుస్తానని మోదీ ఎక్స్‌లోనే ఆమెకు సమాధానమిచ్చారు. నిజానికి మంగళ్ హండా 100వ పుట్టినరోజు సందర్భంగానే ప్రధాని మోదీ ఆయనకు వ్యక్తిగత లేఖ ద్వారా గతంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ప్రధాని వ్యక్తిగతంగా తనను కలవడంతో ఎంతగానో సంతోషించారు. కాగ ప్రధాని మోదీ ఆదివారంనాడు కువైత్ రాజును, ప్రధానమంత్రిని కలవనున్నారు.
మోదీకి ఆ దేశ ఉప ప్రధాని షేక్ ఫహాద్ యూసుఫ్ సౌద్ అల్ సబహ్ విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. ఓ వైపు ప్రవాస భారతీయులంతా చప్పట్లు, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా అక్కడున్న వారందరినీ మోదీ పలకరించారు. రామాయణం, మహాభారతాలను అరబిక్లోకి అనువదించిన అబ్దుల్లా అర్ బెరూన్, ఈ ఇతిహాసాలను అరబిక్‌లో ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ సెనె్ఫలను మోదీ పలకరించారు.
కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని ప్రధాని తెలిపారు. భారత్ స్టార్టప్‌లు, కువైట్ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్‌కు లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్ బాల్ ప్రారంభోత్సవంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబాను కలిశాను. “అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవంలో కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబాను కలవడం ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. శనివారం ఇక్కడి జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మరోవైపు డిసెంబరు 1 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ధ్యానాన్ని తమ జీవితంలో ఓ భాగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్‌లో జరుగుతున్న ‘రన్ ఉత్సవ్’లో పాలుపంచుకోవాల్సిందిగా మోదీ అందరికీ ఆహ్వానం పలికారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు