
బ్రిటన్‌లో అతి పెద్ద సమస్య సహజీవనమే అని, పెళ్లిని వ్యతిరేకించడం పెద్ద సమస్యగా మారినట్లు ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ వెళ్లినప్పుడు అక్కడ తమకు తెలిసిందని ఆయన చెప్పారు. ఐరోపాలో ప్రస్తుతం పెళ్లిళ్ల కంటే సహజీవనాన్నే జంటలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే, అప్పుడు మీరెలా పిల్లల్ని కంటారని గడ్కరీ అడిగారు. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల భవిష్యత్తు ఏంటి ఆయన ప్రశ్నించారు.
సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తే, అది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నించినట్లు గడ్కరీ తెలిపారు. సమాజం తనంతటే తాను నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ దేశంలో లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఆదర్శ భారత దేశంలో విడాకుల్ని నిషేధించాలన్న వాదనను ఆయన ఖండించారు. సహజీవనం మంచిది కాదని చెబుతూ స్వలింగ వివాహాలు కూడా భారతీయ సంస్కృతిని చెడగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ అర్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు