
“సామాజిక సేవ ద్వారా స్వవ్లంబి గ్రామాలు” అనేది భారత దేశ దార్శనికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. కేరళ ఈలక్కుళిలోని పజస్సి రాజా సాంస్కృతిక కేంద్రం అంకిత కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ప్రతి గ్రామం అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ఆయన పిలుపిచ్చారు.
వేల సంవత్సరాల క్రితం భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు జువాన్జాంగ్, ప్రాచీన భారత దేశంలోని స్వావలంబన గ్రామాలను నమోదు చేశారని గుర్తు చేశారు. “లాభాపేక్ష లేకుండా సమాజ సహకారం ద్వారా సమాజానికి సమగ్ర పురోగతిని సాధించడమే మా లక్ష్యం. అలాంటి గ్రామాలు భారత దేశపు ఆత్మ. అవి శతాబ్దాల నిరంతర ప్రయత్నాల ద్వారా మనుగడ సాగించాయి” అని ఆయన తెలిపారు.
అయితే, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ఆర్థిక సహాయంపై మాత్రమే ఆధారపడి ఉండకూడదని దత్తాత్రేయ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మార్గదర్శకత్వం అందించాలి, కానీ సహాయంపై నిరంతరం ఆధారపడటం గ్రామాలను బలహీనపరుస్తుందని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి కేవలం భౌతిక వృద్ధిని మించి ఆధ్యాత్మిక, మానసిక పురోగతిని కలిగి ఉండాలని ఆయన చెప్పారు.
భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటూ, అమృత్ కాల్ (స్వర్ణ యుగం) ప్రయాణాన్ని ప్రారంభించినందున, ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వంటి సవాళ్లు తలెత్తాయని. ఇటువంటి సమయాల్లో, స్వయంసేవకులు గ్రామీణ ప్రాంతాల్లో చురుకుగా, స్థిరంగా సేవలందించారని ఆయన తెలిపారు. సమాజంలో విశ్వాసాన్ని నింపారని కొనియాడారు.
స్వయంసేవకుల నిస్వార్థ సేవ, త్యాగం స్వామి వివేకానందుడు భారత దేశపు సారాంశంగా గుర్తించిన వాటిని ప్రతిబింబిస్తాయని దత్తాత్రేయ తెలిపారు. “ఉత్తర కేరళ గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణించేటప్పుడు, ఈ అప్రమత్తమైన, అవిశ్రాంత సేవా ప్రయత్నాలను చూడవచ్చు. ఇటువంటి కార్యకలాపాలలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ, మనం వాటిని దృఢ సంకల్పంతో అధిగమించి ముందుకు సాగాము” అని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ఉత్తర కేరళ ప్రాంత సంఘచాలక్ అడ్వకేట్. కె.కె. బలరామ్ అధ్యక్షత వహించారు. కన్నూర్‌లోని మాతా అమృతానందమయి మఠం అధిపతి స్వామి అమృత కృపానందపురి ఆశీర్వాద ప్రసంగం చేశారు. విభాగ్ సంఘచాలక్ అడ్వకేట్. సి.కె. శ్రీనివాసన్, జిల్లా సంఘచాలక్ సి.పి. రామచంద్రన్, ఖండ్ సంఘచాలక్ ఎం. అశోకన్ వంటి వారు హాజరయ్యారు. పజస్సి రాజా సాంస్కృతిక కమిటీ చైర్మన్ బిజు ఈలక్కుజి స్వాగత ప్రసంగం చేయగా, కె.పి. సాజిత్ ధన్యవాదాలను ప్రతిపాదించారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్