రష్యాకు చెందిన రహస్య ఉపగ్రహం ‘కాస్మోస్ 2553’ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. ప్రస్తుతం డమ్మీ వార్‌హెడ్ (ఆయుధం)తో భూకక్ష్య వెలుపలి హద్దుల్లో సంచరిస్తున్న ఈ ఉపగ్రహం సాయంతో మున్ముందు క్షిపణులను, అణ్వాయుధాలను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన పలు కీలక ఉపగ్రహాలను నాశనం చేసేందుకు రోదసిలో రష్యా ఓ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అంతరిక్షంలో రష్యా మోహరించే ఆయుధానికి సంబంధించిన విడిభాగాలను ఈ ఉపగ్రహం పరీక్షిస్తున్నట్టు తాము భావిస్తున్నామని, దీని వల్ల ఎదురయ్యే ముప్పును తమ స్పేస్ కమాండ్ నిరంతరం పరిశీలిస్తున్నదని అమెరికా అధికారులు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు తెలిపారు.
రష్యా సైనిక బలగాలను ఉక్రెయిన్‌లోకి పంపడానికి కొన్ని రోజుల ముందు (2022 ఫిబ్రవరిలో) రష్యాలోని ప్లెసెట్స్ కాస్మోడ్రోమ్ నుంచి సూయజ్-2 రాకెట్ ద్వారా ‘కాస్మోస్ 2553’ను నింగిలోకి పంపారు. అనంతరం ఆ ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్య చివరి అంచున (భూమికి దాదాపు 2 కి.మీ. ఎత్తున) చేర్చారు. ఆ ప్రాంతమంతా వాన్ అలెన్ బెల్ట్స్ నుంచి వచ్చే రేడియో ధార్మికతతో సంతృప్తమై ఉంటుంది.
ఇది ఉపగ్రహ భాగాలను నిర్వీర్యం చేస్తుంది. పనికిరాని లేదా నిలిపివేసిన ఉపగ్రహాలను నిశ్శబ్ధంగా వాటంతట అవే నాశనమయ్యేలా చేసేందుకు దూరంగా ఆ ప్రాంతంలోకి పంపుతారు. దీంతో ఆ ప్రాంతాన్ని ‘శ్మశాన కక్ష్య’ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాస్మోస్ 2553’ను ఆ కక్ష్యలో నిలపడం అమెరికా ఖగోళ పరిశీలకుల్లో అనుమానాలను పెంచుతున్నది.
రష్యా కొత్త స్పుత్నిక్ కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక అంతరిక్ష నౌకరేడియేషన్, భారీ చార్జ్డ్ కణాల ప్రభావంతో వాటిని పరీక్షించడానికి ఆన్‌బోర్డ్ సాధనాలు, వ్యవస్థలు నెలకొన్నాయి. అయితే అమెరికా అధికారులు కాస్మోస్ 2553 నిజానికి భవిష్యత్తులో అంతరిక్ష-ఆధారిత ఆయుధం కోసం ఒక పరీక్షా వేదికగా ఉంటుందని భయపడుతున్నారు. ఎందుకంటే ఉపగ్రహం నకిలీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లే అవకాశం ఉంది.
రష్యా అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అమెరికా నిఘా అధికారులు అనుమానిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికన్ మీడియా చెప్పడంతో అంతరిక్ష ఆయుధాల పోటీ గురించి భయం మొదలైంది. మాస్కో ఎలాంటి ఆయుధ వ్యవస్థను మోహరించాలని యోచిస్తోందో ఖచ్చితంగా తెలియదు. అయితే అమెరికా ప్రభుత్వ వర్గాల నుండి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం, భూమిపై లక్ష్యాలను ఢీకొట్టడం కంటే కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలపై దాడి చేయడానికి అంతరిక్ష ఆధారిత అన్వయుధాలను ఉపయోగించే అవకాశం ఉంది.
More Stories
సొంత ప్రజలపైనే బాంబులు వేసే దేశం పాకిస్తాన్
పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ పై ఐసీసీ చర్యలు
పదవి చేపట్టిన నెలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా