
గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం సగం సీట్లు కూడా సాధించలేకపోయిందని చెప్పారు. ఎమ్మెల్యేలను తెలంగాణ, కర్ణాటకకు తరలించాలని ప్లాన్ చేశారని పేర్కొన్నారు.
రాజకీయ అవకాశవాదం తలకెక్కిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్కు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు. ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ గెలవకపోతే ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగినట్లా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్తో జతకట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రజలు బుద్ధి చెప్పారని, మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజీపీ ఓట్లు, సీట్లు సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చారని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత