
”పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్బీర్ సింగ్ రాజీనామా సమర్పించారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగగమైంది. తన నాయకత్వంపై నమ్మకం ఉంచి తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సుఖ్బీర్ కృతజ్ఞతలు తెలియజేశారు” అని దల్జీత్ తెలిపారు.
శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలోనే అధ్యక్షుడు రాజీనామా చేశారని, నవంబర్ 18న వర్కింగ్ కమిటీ సమావేశమై, రాజీనామాపై పరిశీలన చేసి ఎన్నికలపై సమగ్ర ప్రకటన చేస్తుందని తెలిపారు.
ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, సభ తుది నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి మెజారిటీ ఉంటే వారు అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారని చెప్పారు. కాగా, పంజాబ్‌లో కీలక అంశాలను పరిష్కరించడంలోనూ, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ శిరోమణి అకాలీ దళ్ చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది.
ఈ క్రమంలో బాదల్ రాజీనామా కీలక పరిణామంగా చెబుతున్నారు. పార్టీ పునరుజ్జీవనానికి, ప్రాధాన్యతా క్రమాలను మరోసారి హైలైట్ చేస్తూ పటిష్టం కావడానికి ఇదొక అవకాశమని అంటున్నారు. ఈ సందర్భంగా సుఖ్బీర్ సింగ్.. తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తన పదవీ కాలంలో సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, తన రాజీనామాకు సంబంధించి చండీగఢ్‌లో సీనియర్ నేతలతో సుఖ్బీర్ సింగ్ చర్చించారు. త్వరలోనే కోర్ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే నాలుగు స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలపై కూడా చర్చించినట్లు చీమా తెలిపారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’