
“ఆ దేశంలో న్యాయవ్యవస్థ సున్నితంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అందుకే అక్కడ ఖలిస్థానీలు ఆశ్రయం పొందుతున్నారు. కెనడాలో అతి తక్కువ సంఖ్యలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారు. మిగిలిన సిక్కు కుటుంబాలను వారు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనేక అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. గురుద్వారాల ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు” అని సంజయ్ వర్మ విమర్శించారు.
మరోవైపు, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గంతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేశాయి. అయితే అందుకు తగిన ఆధారాలను చూపించలేదు. ఈ క్రమంలోనే కెనడాలోని దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది.
పోలీసు విచారణలో భారత హైకమిషనర్ పాల్గొనాలని కెనడా కోరిందని, అందుకే మన హైకమిషనర్తోపాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించామని విదేశాంగ మంత్రి ఇటీవల ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాయబారి సంజయ్ కుమార్ వర్మ తిరిగివచ్చారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెనడా విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి