
ఆర్థికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారన్ ఏస్‌మోగ్లు, సిమన్ జా,న్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన జేమ్స్.ఎ.రోబిన్‌సన్‌లకు ఈ యేటి ఎకనామిక్స్ నోబెల్ దక్కింది. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధనలు చేసిన ముగ్గురికి ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది.
వీరు చేసిన పరిశోధనలు దేశాలు సమృద్ధి చెందడం వెనుక సాంఘిక వ్యవస్థల పాత్రను అర్థం చేసుకునేందుకు, వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలు తెలుసుకునేందుకు ఉపకరించాయని స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ కమిటీ పేర్కొంది.
“దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడం మన ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంఘిక వ్యవస్థలు ఎంత ముఖ్యమో ఈ పరిశోధకులు మనకు తెలియచెప్పారు. చట్టాలను సరిగా పాటించని సమాజాలు, ప్రజలను దోచుకునే వ్యవస్థలు ఉన్న దేశాలు అభివృద్ధి కావు, సరైన దిశలో మార్పు చెందవు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వీరి పరిశోధన మనకు ఉపకరిస్తుంది” అని నోబెల్ కమిటీ తెలిపింది.
గతేడాది కూడా ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. బెన్ ఎస్ బెర్నాంకి, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.దిబ్విగ్‌లు నోబెల్‌ను అందుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురు పరిశోధనలు చేశారు. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు. బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
నోబెల్ పురస్కార విజేతలైన ఏస్మొగ్లు, జాన్సన్- మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో రాబిన్సన్ పరిశోధనలు చేస్తున్నారు. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సాంకేతికంగా నోబెల్ ప్రైజ్గా పరిగణించరు. అధికారికంగా దీనిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ అంటారు. కానీ, మిగిలిన ఐదు పురస్కారాలతోపాటే ఆర్థిక శాస్త్రం అవార్డును కూడా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న విజేతలకు ప్రదానం చేస్తారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా