హెలెన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది. మిల్టన్ తుఫాన్ బుధవారం ఫ్లోరిడాను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి. టంపా నగరలో రికార్డు స్థాయిలో 41 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో వరదలు పోటెత్తాయి.
తుఫాన్ ధాటికి నలుగురు మృతిచెందారు. 30 లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెయింట్ పీటర్స్బర్గ్ నివాసితులకు నీటి సరఫరా ఆగిపోయింది. బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో ఫ్లోరిడాలోని సియస్టా కే సమీపంలో తీరాన్ని దాటింది. కేటగిరీ 3గా వర్గీకరించిన ఈ తుపాను కారణంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి,. భారీగా వర్షాలు కురిశాయి.
ఆకస్మిక వరదలు సంభవించాయని జాతీయ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు టోర్నడోలు చోటు చేసుకున్నాయి. ఈ తుపాను ప్రభావంతో 15 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు. పెద్ద సంఖ్యలో గృహాలు విధ్వంసమయ్యాయని, కొంతమంది మరణించారని వార్తలందాయి.
ఎంతమంది అనే వివరాలు ఇంకా పూర్తిగా అందలేదని సెయింట్ లూటీ కౌంటీ షరీఫ్ తెలిపారు. టాంపా బే ఏరియాలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
టాంపా, సెయింట్ పీటర్స్ బ ర్ట్ల్లో 60శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో గ్యాస్ అయిపోయింది. 15 కౌంటీల్లోని సుమారు 70 లక్షల మంది ప్రజలను తప్పనిసరిగా నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా 1900 విమానాలను రద్దు చేశారు. కాగా, పశ్చిమ ఫ్లోరిడాలో రెండు వారాల క్రితం హెలెన్ తుఫాన్‌కు 230 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!