
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా తర్వాత వెనబడింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ బీజేపీ ఇప్పటికే 47 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 34 స్థానాల్లో విజయం సాధించింది. ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీ లాడ్వా స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్‌ను 16 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఏడాది కిందట మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన షైనీ.. ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించారు. ఆయన సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదుచేసింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితలు వెలువడ్డాయి. బీజేపీకి ఓటమి తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కానీ, వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ గెలుపు ముంగిట బోర్లాపడింది. పోస్టల్ బ్యాలట్ ఫలితాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామనే అమిత విశ్వాసంతో ఉదయం మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తీరా ఫలితాలు చూసేసరికి డీలా పడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుకోవడంలో విఫలమైంది. తాజా విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. జాట్‌లు వ్యతిరేకతను అధిగమించి గెలుపు బావుటా ఎగురువేసింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్ధి బీజేపీ అబ్యర్ధి యోగేశ్ కుమార్‌ను 6,015 ఓట్ల తేడాతో ఓడించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ‘హ్యాట్రిక్’ విజయం దిశగా దూసుకు వెళ్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం స్వాగత సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
పెద్దగా పరిపాలనా అనుభవం లేని నయాబ్ సింగ్ సైనీని ఈ ఏడాది మార్చిలో హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో తీసుకువచ్చిన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత నుండి పార్టీకి, ప్రభుత్వానికి కొత్త ముఖం అందించారు. లోక్‌సభ ఎన్నికలలో సగం సీట్లు కోకోల్పోవడంతో కాస్త ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బుధవారం ఫలితాలు ఆయన సామర్ధ్యానికి అద్దం పట్టాయి.
సైనీ రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేయడంలో ఎటువంటి అవకాశాన్ని వదులుకోలేదు. జాట్ లు కాంగ్రెస్ వెనుక సమీకృతం అవుతుండగా, సైనీ ప్రభుత్వం అనేక రకాల ప్రకటనలు చేసింది, ప్రత్యేకించి ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసిలు), షెడ్యూల్డ్ కులాలపై దృష్టి సారించారు. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత 100 చదరపు గజాల ప్లాట్లు, హర్యానా అంత్యోదయ పరివార్ పరివాహన్ యోజన, 1,000 కి.మీ వరకు ఉచిత బస్సు ప్రయాణం , అనధికార నివాస కాలనీలకు ఆమోదం వంటి ప్రకటనలు విశేషంగా ప్రజలలోకి వెళ్లాయి.
గత కాంగ్రెస్ ప్రభుత్వం (భూపేందర్ సింగ్ హుడా)లో పలుకుబడి, అవినీతి ద్వారా ఉద్యోగాలు వచ్చేయని, కానీ బిజెపి ప్రభుత్వంలో ప్రతిభ ఉంటె చాలానే ప్రచారం విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళనల నిర్వహణపై రైతులలో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం ఉందని తెలుసుకున్న సైనీ తన ప్రచారాల్లో రైతుల కోసం బీజేపీ పథకాలపైనే ఆధారపడ్డాడు. సైనీ ప్రతిరోజూ వేలాది మందిని కలుసుకునేవాడని చెబుతారు.
మరోవంక, మూడు నెలల ముందు నుండే బీజేపీ ప్రచారం ఓ విధంగా ప్రారంభించి 150కు పైగా బహిరంగసభలు నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అందులో సగం సభలు కూడా జరపలేదు. బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకొని, ఉమ్మడిగా ప్రచారం చేపడితే, కాంగ్రెస్ లో ఒక నేత ఆధిపత్యం కారణంగా ఆ పార్టీకి సాంప్రదాయ ఓటర్లు కూడా దూరమయ్యారు. పైగా, ఆ నేత అహంకారం కారణంగా ఆప్ తో పొత్తు సాధ్యం కాలేదు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు