వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

అమెరికన్‌ శాస్త్రవేత్తలైన విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌లకు 2024 సంవ‌త్స‌రానికి వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించారు. జీన్ రెగ్యులేష‌న్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర‌ను విశ్లేషించినందుకు ఆ ఇద్ద‌రికి అవార్డును ప్ర‌క‌టిస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.

బ‌హుక‌ణ జీవుల్లో గ‌డిచిన 500 మిలియ‌న్ల ఏళ్ల‌లో మైక్రోఆర్ఎన్ఏ ఎంతో రూపాంతంరం చెందిన‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు నిరూపించారు. మ‌నుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏల్లో.. వేల సంఖ్య‌లో జ‌నువులు ఉన్నాయ‌ని, అయితే జ‌న్యువుల‌ను మైక్రోఆర్ఎన్ఏ రెగ్యులేట్ చేస్తున్న‌ద‌ని పేర్కొన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించారు. 

మ‌నుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏ.. బ‌హుక‌ణ జీవుల్లోని ఆర్ఎన్ఏ ఒకే విధంగా ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. జ‌న్యు నియంత్ర‌ణ గురించి ఎన్నో ద‌శాబ్ధాలుగా స్ట‌డీ జ‌రుగుతోంది. ఒక‌వేళ జ‌న్యు నియంత్ర‌ణ గ‌తి త‌ప్పితే, అప్పుడు తీవ్ర‌మైన క్యాన్స‌ర్, డ‌యాబెటిస్ లాంటి వ్యాధులు సోకే ప్ర‌మాదం ఉంద‌ని నోబుల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

విక్ట‌ర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు 1ఎంఎం పొడువైన వాన‌పాము సీ.ఎలిగాన్స్‌ జీవిని స్ట‌డీ చేశారు. చాలా చిన్న సైజులో ఉండే ఆ జీవిలో.. ఎన్నో ర‌కాల ప్ర‌త్యేక‌మైన క‌ణాలు ఉన్నాయి. ఆ రౌండ్‌వామ్‌లో న‌రాల‌, క‌ణజాల క‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇదే త‌ర‌హా క‌ణాలు.. అతిపెద్ద‌, సంక్లిష్ట‌మైన జంతువుల్లోనూ గుర్తించ‌వ‌చ్చు. క‌ణ‌జాలం ఎలా వృద్ధి చెందుతుందన్న అంశాన్ని మైక్రోఆర్ఎన్ఏ ద్వారా స్ట‌డీ చేశారు.

గ‌త ఏడాది ఫిజియాల‌జీ లేదా మెడిసిన్‌లో.. కాట‌లిన్ క‌రికో, డ్రూ వైజ్‌మాన్‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. కోవిడ్‌19కు వ్య‌తిరేకంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల త‌యారీలో ఆ ఇద్ద‌రూ కీల‌క పాత్ర పోషించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మెడిసిన్ ప్రైజ్‌ను 114 సార్లు మొత్తం 227 మందికి ఇచ్చారు. మెడిసిన్ కేట‌గిరీలో కేవ‌లం 13 మంది మ‌హిళ‌లు మాత్ర‌మే ఆ అవార్డు అందుకున్నారు. అవార్డు కింద 11 మిలియ‌న్ల స్వీడిష్ క్రాన‌ర్(మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు) అందిస్తారు.

డిసెంబ‌ర్ 10వ తేదీన, సృష్టిక‌ర్త నోబెల్ ఆల్‌ఫ్రెడ్ జ‌యంతి సంద‌ర్భంగా జ‌రిగే కార్య‌క్ర‌మంలో విజేత‌ల‌కు సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు అంద‌జేస్తారు. మంగ‌ళ‌వారం ఫిజిక్స్‌, బుధ‌వారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్యం రంగాల్లో ప్రైజ్‌ల‌ను ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం నోబెల్ శాంతి బ‌హుమ‌తి, ఇక అక్టోబ‌ర్ 14వ తేదీన ఆర్థిక శాస్త్రంలో బ‌హుమ‌తి ప్ర‌క‌టిస్తారు.