హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఫలింపక పోవచ్చని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలదని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 55కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేస్తున్నాయి.
అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. 90 సీట్లున్న ఈ రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 65 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు వచ్చిన అనంతరం శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో హరియాణాలో 68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 7 ఎగ్జిట్ పోల్స్‌కు గాను సగటున కాంగ్రెస్ 55 సీట్లు రానున్నాయి. మెజారిటీ మార్క్ 46 కంటే ఇవి 9 అధికం.
హర్యానా ముఖ్యమంత్రిగా సీఎల్పీ నాయకుడు భూపీందర్‌కు 39%, కాంగ్రెస్ ఎంపీ కుమారీ షెల్జాకు 10%, సిట్టింగ్ బీజేపీ సీఎం సైనీకి 28%, కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 6 శాతం మంది మద్దతిస్తున్నారని పీపుల్స్‌పల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే తిరిగి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు.
పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 50కి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని వివిధ సర్వేలు వెల్లడించాయి.
పీపుల్స్ పల్స్ సర్వే: కాంగ్రెస్ 55, బిజెపి 26, ఐఎస్‌ఎల్‌డి 2 నుంచి 3, జెజెపి 01, ఇతరులు 3 నుంచి 5
రిపబ్లిక్ మాట్రిజ్: కాంగ్రెస్ 55 నుంచి 62 బిజెపి 18 నుంచి 24, ఐఎన్‌ఎల్‌డి+బిఎస్‌పి 3 నుంచి 6 జెజెపి 3
ఇండియా టు డే సి ఓటర్: కాంగ్రెస్ 50 నుంచి 58, బిజెపి 20 నుంచి 28, జెజెపి 0 నుంచి 2, ఇతరులు 10 నుంచి 14
పి మార్క్: కాంగ్రెష్ 44 నుంచి 54, బిజెపి 15 నుంచి 29, జెజెపి 0, ఐఎన్‌ఎల్‌డి 3 నుంచి 6 ఇతరులు 0
దైనిక్ భాస్కర్ : కాంగ్రెస్ 44 నుంచి 54, బిజెపి 19 నుంచి 29, జెజెపి 0 నుంచి ఐఎన్‌ఎల్‌డి 1 నుంచి 5 ఇతరలు 4నుంచి 9
ధ్రువ్ రీసెర్చ్: కాంగ్రెస్ 57 నుంచి 64, బిజెపి 27 నుంచి 32, ఇతరులు 5 నుంచి 8
జమ్ము కశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. 90 అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి 45 స్థానాలు వచ్చే అవకాశం లేకపోవడంతో హంగ్ వచ్చే అవకాశం ఉంది వివిధ సర్వేలు పేర్కొన్నాయి.
More Stories
బాల పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్
తిరువనంతపురం మేయర్‌గా వీవీ రాజేశ్
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ