కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అక్రమాల కేసులో సోమవారం ఉదయం సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. డీకే శివకుమార్ పై ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది.
డీకే శివకుమార్ తోపాటు అతని సోదరుడు డీకే సురేష్ కు చెందిన కర్ణాటక, ముంబై ఇళ్లలోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. దొడ్డలహాలి, కనకపురాలతో పాటు బెంగళూరులోని సదాశివనగర్ లలో గల శివకుమార్ ఇల్లు, వారి ఫార్మ్ హౌస్ లతో పాటు మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
కర్నాటక, ముంబై ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ నమోదు చేసిన కేసులో సీబీఐ విచారణ చేపడుతున్నది. మనీల్యాండరింగ్ కేసులో భాగంగా ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత ఏడాది ఈడీ తన సోదా నివేదికను సీబీఐకి చేరవేసింది.
శివకుమార్‌ను గత ఏడాది ఈడీ నాలుగు రోజుల పాటు అరెస్టు చేసి ప్రశ్నించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను విచారించారు. శివకుమార్ వద్ద అక్రమంగా 8.6 కోట్లను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 11 కోట్లకు పెంచేశారు. 2018లో శివకుమార్‌పై ఈడీ మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసింది. ఐటీ శాఖ ఫైల్ చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ విచారణ మొదలుపెట్టింది.
కాగా, కర్ణాటకలో ప్రస్థుత బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టినందుకే బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సంసిద్ధం కాకుండా దెబ్బతీసేందుకు కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు చేయించారని సిద్ధరామయ్య ఆరోపించారు.

More Stories
అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్
భారత్ కు అమెరికా జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులు